ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తాజాగా చేపట్టిన 15 రోజుల ఉపవాస దీక్ష(Upavasadeeksha)పై తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. పవన్ కల్యాణ్ ఈనెల 22న మధురైలో జరగబోయే మురుగన్ భక్తుల మహానాడు (Murugan Bhaktha Mahanadu)లో ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు. ఈ యాత్రను దృష్టిలో పెట్టుకొని పవన్ తమ భక్తి ప్రదర్శనగా, శుద్ధిచర్యగా ఉపవాస దీక్షలో పాల్గొంటున్నారని బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ వెల్లడించారు.
CBN : తాట తీస్తా..జగన్ కు బాబు ఊర మాస్ వార్నింగ్ !
పవన్ కల్యాణ్ స్వయంగా మురుగన్ భక్తుడిగా నిలిచారని నాగేంద్రన్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు పవన్ మురుగన్ దేవుడి ఆరాధనార్థం మొత్తం 6 క్షేత్రాలను సందర్శించారని తెలిపారు. మురుగన్ దేవుడు తమిళనాడు ప్రజల మత విశ్వాసానికి కేంద్రబిందువుగా నిలుస్తున్న విషయం తెలిసిందే. పవన్ ఆయనపై చూపుతున్న భక్తి, తమిళ ప్రజలతో ఆయనకు ఏర్పడుతున్న మానసిక అనుబంధానికి నిదర్శనంగా పేర్కొనవచ్చు.
ఈ దీక్షలో పవన్ కల్యాణ్‌తో పాటు నయినార్ నాగేంద్రన్ కూడా పాల్గొంటున్నట్టు తెలియజేశారు. రాజకీయ నాయకులు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం అరుదుగా జరగే విషయం. అయితే పవన్ కల్యాణ్ ఈ క్రమంలో రాజకీయాలకంటే మత విశ్వాసానికి ప్రాధాన్యతనిస్తూ తన వినయాన్ని, భక్తిని నిరూపిస్తున్నారు. ఇది తమిళ ప్రజల్లో పవన్ పట్ల ప్రత్యేకమైన గౌరవాన్ని కలిగించగలదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.