Site icon HashtagU Telugu

Pawan CM slogan : ప‌వ‌న్ సీఎం లెక్క‌తో ఏపీ రాజ‌కీయాల్లో తిక్క.!

Pawan CM slogan

Pawan Kalyan

జ‌న‌సేనాని ప‌వ‌న్ ఏపీ రాజకీయ ముఖ‌చిత్రాన్ని మార్చేస్తున్నారు. రోజుకో స్టేట్మెంట్ తో (Pawan CM slogan) క‌న్ఫ్యూజ‌న్ క్రియేట్ చేస్తున్నారు. ఇటీవ‌ల వ‌ర‌కు రాజ‌కీయ వీర‌మ‌ర‌ణం పొంద‌కుండా ఉండేలా పొత్తులు ఉంటాయ‌ని చెప్పారు. గౌర‌వ‌ప్ర‌దంగా పొత్తులు(Alliance) ఉంటాయ‌ని అన్నారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు బ్యాంకు చీల‌కుండా చేస్తాన‌ని శ‌ప‌థం చేశారు. ముఖ్య‌మంత్రి ప‌ద‌వి రేస్ లో లేన‌ని క్లియ‌ర్ గా చెప్పారు. కానీ, ఇప్పుడు పీఠాపురం వేదిక‌గా ఆయ‌న ట్రాట‌జీ మారింది. సీఎం రేస్ లో ఉన్నానంటూ ప్ర‌క‌టించారు. ఫ‌లితంగా ఏపీ రాజ‌కీయాల్లో మ‌రోసారి తిక‌మ‌క నెల‌కొంది.

జ‌న‌సేనాని  స్టేట్మెంట్ తో  క‌న్ఫ్యూజ‌న్(Pawan CM slogan)

`నాకో తిక్క ఉంది దానికో లెక్క ఉంది.` అనేది ప‌వ‌న్ (Pawan CM slogan) సినిమాలోని ఒక డైలాగు. అదే డైలాగును రాజ‌కీయాల్లోనూ అమ‌లు చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ప‌దేళ్ల క్రితం పార్టీ పెట్టిన ప‌వ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు గుర్తింపును పొంద‌లేక‌పోయారు. రెండు చోట్ల పోటీచేసి 2019 ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. ఆ పార్టీకి కేవ‌లం నాలుగు శాతం ఓటు బ్యాంకు మాత్ర‌మే ఉంద‌ని గ‌త ఎన్నిక‌ల ఆధారంగా అంచ‌నా వేయొచ్చు. ఎందుకంటే, 2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌, బీఎస్పీ, క‌మ్యూనిస్ట్ లు కూట‌మిగా పోటీకి దిగ‌డం జ‌రిగింది. ఆ కూట‌మికి 5శాతం ఓటు బ్యాంకు మాత్ర‌మే వ‌చ్చింది. అంటే, దానిలో మేజ‌ర్ షేర్ జ‌న‌సేన‌దిగా అంచ‌నా వేస్తే, క‌నీసం 4 శాతం అనుకోవ‌చ్చు. ఇప్పుడు గ‌తం కంటే పెరిగిందని ఆ పార్టీ అంచనా.

సీఎం ప‌ద‌వి అర్హుడ‌ను అంటూ పిఠాపురం వేదిక‌గా ప‌వ‌న్ 

ఒక వేళ వ‌చ్చే ఎన్నిక‌ల్లో గుర్తింపు పొందేందుకు అవ‌స‌ర‌మైన ఓటు బ్యాంకును జ‌న‌సేన పొంద‌లేక‌పోతే శాశ్వ‌తంగా గుర్తింపు ర‌ద్దు అవుతోంది. అందుకే, రాజ‌కీయ వీర‌మ‌ర‌ణం పొంద‌కుండా టీడీపీతో పొత్తు పెట్టుకోవాల‌ని ప‌వ‌న్ ఆలోచ‌న‌. కానీ, కాపు సామాజిక‌వ‌ర్గంకు చెందిన కొంద‌రు పెద్ద‌లు, వీరాభిమానులు ఆయ‌న్ను సీఎంగా చూడాల‌ని భావిస్తున్నారు. స‌భ‌ల‌కు వ‌స్తోన్న అభిమానుల‌ను సంతోష ప‌ర‌చ‌డానికి సీఎం ప‌ద‌వి అర్హుడ‌ను అంటూ (Pawan CM slogan) పిఠాపురం వేదిక‌గా ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. అంటే, టీడీపీతో పొత్తు ఉండ‌ద‌ని ప‌రోక్ష సంకేతాలు ఇచ్చారు. అంటే, బీజేపీతో క‌లిసి వెళ్ల‌డానికి సిద్ద‌ప‌డ్డార‌ని భావించాలి.

ముక్కోణ‌పు పోటీలో కింగ్ మేక‌ర్ అవుతామ‌ని జ‌న‌సేన అంచ‌నా

ప్ర‌స్తుతం బీజేపీ, జ‌నసేన పొత్తు కొన‌సాగుతోంది. ఆ రెండు పార్టీల‌కు ఉన్న ఓటు బ్యాంకును అంచ‌నా వేసుకోవాలంటే, తిరుప‌తి లోక్ స‌భ, ఆత్మ‌కూరు, బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను తీసుకోవ‌చ్చు. ఆత్మ‌కూరు, బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గాల‌కు జ‌రిగిన ఉప ఎన్నిక‌లకు జ‌న‌సేన దూరంగా ఉంది. కానీ, తిరుప‌తి లోక్ స‌భ‌కు ఎన్నిక‌ల్లో మాత్రం ఆ రెండు పార్టీలు క‌లిసి వెళ్లిన‌ప్ప‌టికీ డిపాజిట్ రాలేదు. రాబోవు ఎన్నిక‌ల్లో కూడా అదే జురుగుతుంద‌ని జ‌న‌సేనాని భావిస్తున్నారు. అందుకే, టీడీపీతో పొత్తు పెట్టుకుని పార్టీ బ‌తికించుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నారు. కానీ, కాపు సామాజిక వ‌ర్గం పెద్ద‌లు మాత్రం సీఎంగా ప‌వ‌న్ ను (Pawan CM slogan) చూడాల‌ని క‌ల‌లు కంటున్నారు. అందుకు, అన్ని ర‌కాల వ్యూహాల‌ను అనుస‌రిస్తాన‌ని ప‌వ‌న్ కూడా చెబుతున్నారు.

Also Read : Pawan Kalyan : నాకు అధికారం ఇవ్వండి.. సీఎం అవ్వడానికి సిద్ధంగా ఉన్నా.. గుండా కొడుకులకు నరకం చూపిస్తా

పిఠాపురం వేదిక‌గా ప‌వ‌న్ స్పీచ్ ను బేస్ చేసుకుని ఏపీ రాజ‌కీయాల‌ను ప‌రిశీలిస్తే, రాబోవు రోజుల్లో జ‌న‌సేన, బీజేపీ కూట‌మిగా వెళ‌నున్నాయి. అలాగే, ఉభ‌య క‌మ్యూనిస్ట్ లు, కాంగ్రెస్ తో క‌లిసి టీడీపీ కూట‌మి క‌ట్టే ఛాన్స్ ఉంది. అధికారంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంట‌రిగా వెళ్ల‌నుంది. అంటే, ముక్కోణ‌పు పోటీ జ‌ర‌గ‌నుంద‌ని ప‌వ‌న్ స్పీచ్ ను బేస్ చేసుకుని ఏపీ రాజ‌కీయాల‌ను అంచ‌నా వేయ‌డానికి అవ‌కాశం ఉంది. అదే జ‌రిగితే, టీడీపీ అధికారంలోకి రావ‌డానికి అవ‌కాశం ఉంద‌ని ఆ పార్టీ చెబుతోంది. కానీ, ముక్కోణ‌పు పోటీలో కింగ్ మేక‌ర్ (Pawan CM slogan) అవుతామ‌ని జ‌న‌సేన అంచ‌నా వేస్తూ సీఎం ప‌ద‌వికి సిద్ధ‌మంటూ ప‌వ‌న్ ప్ర‌క‌టించార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లోని చర్చ‌.

Also Read : Janasena varaahi : ప‌వ‌న్ `ముంద‌స్తు` మాట! ఏపీ, తెలంగాణ ఎన్నిక‌లు ఒకేసారి..?