Tirumala Laddu Controversy : తిరుమల లడ్డు వివాదం (Tirumala Laddu Controversy) ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. దీనిపై హిందువులే కాదు..రాజకీయ పార్టీలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ..కఠిన శిక్షలు విధించాలని కోరుతున్నారు. గత వైసీపీ (YCP) ప్రభుత్వంలో తిరుమల లడ్డు అపవిత్రమైందని, ఎంతో శ్రేష్టమైన ఆవునెయ్యి తో చేయాల్సిన లడ్డును..గత ప్రభుత్వం జంతువుల కొవ్వుతో చేసారని సాక్ష్యాత్తు సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆరోపించడం తో దేశ వ్యాప్తంగా దీనిపై ఆగ్రహపు జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. దీనిపై గత ప్రభుత్వం సీఎం , వైసీపీ అధినేత జగన్ , మాజీ TTD చైర్మన్ తదితరులు స్పందించారు. తమ హయాంలో ఎలాంటి తప్పు జరగలేదని ..కావాలనే చంద్రబాబు ఇలా కామెంట్స్ చేసి హిందువుల మనుభవాలు దెబ్బతీస్తున్నారని వాపోయారు. ప్రస్తుతం దీనిపై చర్చ నడుస్తుంది. ఈ వ్యవహారం కోర్ట్ వరకు వెళ్ళింది.
తిరుమల లడ్డూ వివాదంపై తమిళనాడులోని NTK పార్టీ (Naam Tamilar Katchi) అధినేత సీమాన్ (Seeman) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘లడ్డూ తప్ప దేశంలో ఇంక ఏ సమస్యలు లేవా..? కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా..? కల్తీ జరిగితే చర్యలు తీసుకోండి. అంతేకాని లడ్డూ, బూందీ అంటూ రాజకీయాలు చేయొద్దు అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేసారు. తిరుమల లడ్డూను కావాలనే వివాదం చేస్తున్నారని… ఇతర సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండి’ అని మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. సీమాన్ వ్యాఖ్యలపై కూడా హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోపక్క కొవ్వు కలిసిందన్న నేపథ్యంలో ప్రసాదం పవిత్రతను పునరుద్ధరించినట్లు ఆలయ పాలకవర్గం ఓ ప్రకటన విడుదల చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రస్తుతం ప్రసాదం పూర్తిగా స్వచ్ఛమైనదిగా ఉందని తెలిపింది. శుక్రవారం అర్థరాత్రి టీటీడీ సోషల్ మీడియా సైట్ ఎక్స్‌లో ఇలా రాసింది. శ్రీవారి లడ్డూ దైవత్వం, పవిత్రత ఇప్పుడు నిష్కళంకమైనది. భక్తులందరూ సంతృప్తి చెందేలా లడ్డూ ప్రసాదం పవిత్రతను కాపాడేందుకు టీటీడీ కట్టుబడి ఉందని పేర్కొంది.
Read Also : Srivari Laddu Prasadam: తిరుపతి లడ్డూలపై టీటీడీ బోర్డు కీలక ప్రకటన..!