Married 50 People: ఓ మహిళ నిత్య పెళ్లి కూతురిగా మారి 50 మంది వ్యక్తులను మోసం చేసింది. అయితే ఈ కిలాడీ వలలో ఒక డీఎస్పీ, ఇద్దురు పోలీసు అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వారి పేర్ల బయటకు రాలేదు. వీరితో పాటు మరో 50 మందిని పెళ్లి (Married 50 People) చేసుకుని మోసం చేసింది సదరు మహిళ. అయితే తమిళనాడు- తిరుపూర్‌కు చెందిన ఓ యువకుడు తనకు పెళ్లి కావటంలేదని తమిళనాడుకు చెందిన ఓ మ్యారేజ్ బ్యూరోలో తన వివరాలను నమోదు చేసుకున్నాడు. అయితే ఈ బ్యూరోలో సంధ్య అనే సదరు మహిళ నచ్చడంతో ఆమెకు పెళ్లి ప్రపోజల్ పంపాడు. ఆమె కూడా ఆ యువకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే సంధ్యను యువకుడు పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లైన 3 నెలలు మంచిగా ఉన్న సంధ్య ఇటీవల కాలంలో తన ప్రవర్తనలో మార్పు వచ్చినట్లు యువకుడు గుర్తించాడు.
ఈ విషయమై ఇద్దరి మధ్య పలు సార్లు గొడవలు కూడా జరిగాయి. అయితే ఒకరోజు అనుమానం వచ్చిన యువకుడు సంధ్య ఆధార్ కార్డును చెక్ చేయగా.. అందులో భర్త పేరు స్థానంలో యువకుడి పేరు కాకుండా వేరే వ్యక్తి పేరు ఉండటం చూసి షాక్ అయ్యాడు. ఈ విషయమై యువకుడు సంధ్యను నిలదీశాడు. దీంతో తన నిజ స్వరూపాన్ని బయటపెట్టింది సంధ్య. ఇలాంటి విషయాలు ఏమైనా అడిగితే యువకుడ్ని చంపేస్తానని సంధ్య బెదిరించింది. దీంతో ఆ యువకుడికి ఏం చేయాలో అర్థంకాక స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. అయితే ఈ విషయమై పోలీసులు రంగంలోకి దిగారు.
Also Read: Telangana Border : బార్డర్‌లో 3వేల కృష్ణ జింకలు.. ఎలా పట్టుకోబోతున్నారంటే ?
యువకుడు చెప్పిన సమాచారం ఆధారంగా సంధ్యను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. యువకుడి కంటే ముందే సంధ్య 50 మందికిపైగా వ్యక్తలను వివాహం చేసుకున్నట్లు తెలిసి పోలీసులు సైతం షాక్‌కు గురయ్యారు. ఈ విచారణలోనే సంధ్య ఒక డీఎస్పీ, ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్, మదురైలో మరో పోలీసు అధికారి, కరూర్‌లో ఒక ఫైనాన్స్ అధికారితో సహా 50 మందికి పైగా పెళ్లి చేసుకుందని తేలింది. దీంతో పోలీసులు సంధ్యపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
We’re now on WhatsApp : Click to Join