Site icon HashtagU Telugu

Love Jihad In Ranchi: ముంబై మోడల్ పై ట్రైనర్ అత్యాచారం ఆపై వేధింపులు

Love Jihad In Ranchi

New Web Story Copy 2023 05 31t154138.437

Love Jihad In Ranchi: జార్ఖండ్‌లో లవ్ జిహాద్ కేసు తెరపైకి వచ్చింది. రాంచీలో మోడలింగ్ కోచింగ్ నిర్వహిస్తున్న తన్వీర్ అక్తర్‌పై ముంబైలో నివసిస్తున్న ఓ మోడల్ లవ్ జిహాద్ ఆరోపణలు చేసింది.

వివరాలలోకి వెళితే.. బీహార్‌కి చెందిన యువతి మోడలింగ్‌లో మెళకువలు నేర్చుకోవడానికి రాంచీకి వచ్చింది. మోడలింగ్ ట్రైనర్ తన్వీర్ అక్తర్ తనను తాను యష్ (హిందూ)గా పరిచయం చేసుకుని యువతికి దగ్గరయ్యాడు. ఇప్పుడు మతం మారాలని, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నాడు. ఇదిలా ఉండగా అక్తర్ 2021 నుంచి తనపై అత్యాచారం చేస్తున్నాడని, అసభ్యకరమైన ఫోటోలను వైరల్ చేస్తానని బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది. ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని తన్వీర్ బెదిరించాడని ఆ యువతి చెప్పింది.

తాజాగా మోడల్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో వీడియోను షేర్ చేసింది. తన్వీర్ బాధలను భరించలేక రాంచీని వదిలి ముంబైకి వచ్చినట్టు తెలిపింది. అయితే అక్తర్ ఆమెను వెంటాడుతూనే ఉన్నాడని, ముంబైకి వచ్చాడని తెలిపింది. తన్వీర్ తనకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని బాధితురాలు వాపోయింది. దీంతో మనోవేదనకు గురైన మోడల్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రిజిస్టర్డ్ ఎఫ్‌ఐఆర్‌లో… బికామ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నప్పుడు 2020లో మోడలింగ్ చేయాలనే ఆలోచన వచ్చిందని మోడల్ చెప్పింది. గూగుల్ లో వెతికితే రాంచీలోని యష్ మోడల్ ఇనిస్టిట్యూట్ అడ్రస్ దొరికిందని పేర్కొంది. .ఇన్‌స్టిట్యూట్‌ను సంప్రదించగా 15 రోజుల వర్క్‌షాప్‌కు రూ.10,000 ఇస్తామని హామీ ఇచ్చారని బాధితురాలు తెలిపారు. కుటుంబ సభ్యుల అనుమతితో నేను జనవరి 6న రాంచీకి వచ్చానని తెలిపింది. కోచింగ్ లో హాస్టల్ సౌకర్యం కూడా ఉందని, అక్కడ మరో 10 మంది అమ్మాయిలతో వర్క్‌షాప్‌లు చేయడం ప్రారంభించానని పేర్కొంది.

హోలీ పండుగ రోజు తన్వీర్ శీతల పానీయంలో మత్తు కలిపి ఇచ్చాడని, దాంతో స్పృహ తప్పి పడిపోయ్యానని. తన్వీర్ నన్ను గదిలోకి తీసుకెళ్లాడని తెలిపింది.ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు చెప్పారు.ఆ తర్వాత కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరిస్తుండేవాడని తెలిపింది. తన్వీర్ తనకు సంబంధించిన కొన్ని అభ్యంతరకరమైన ఫోటోలను తన తల్లి మరియు సోదరుడికి కూడా పంపాడని యువతి తెలిపింది. ఆ సమయంలో నేను సూసైడ్ చేసుకోవాలని అనుకున్నానని, కానీ కుటుంబ కోసం ఆగానని ఆమె చెప్పింది.

Read More: Apple – Indian Student : ఇండియా స్టూడెంట్ కు యాపిల్ ప్రైజ్.. ఎందుకు ?