Coimbatore: కోయంబ‌త్తూర్ మ‌సీదుల్లో ఇంకుడు గుంత‌లు

భ‌విష్య‌త్ నీటి అవ‌స‌రాల తీర్చుకోవ‌డానికి ముంద‌స్తుగా మ‌సీదుల్లో వినూత్న ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తున్నారు.

  • Written By:
  • Updated On - November 17, 2021 / 04:40 PM IST

భ‌విష్య‌త్ నీటి అవ‌స‌రాల తీర్చుకోవ‌డానికి ముంద‌స్తుగా మ‌సీదుల్లో వినూత్న ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తున్నారు. కోయంబ‌త్తూర్ మ‌సీదుల్లో నీటి కొర‌తను నివారించ‌డానికి ఇప్ప‌టి నుంచే పొదుపుగా వాడ‌డం ప్రారంభించారు. భూగర్భ జలాలను మెరుగుపరచడానికి మరియు నీటి కొరత నుండి తమను తాము రక్షించుకోవడానికి అక్క‌డ మ‌సీదుల్లో నూత‌న ప‌ద్ధ‌తుల‌ను అవంభిస్తున్నారు.
కోయంబ‌త్తూర్ లోని 135 మసీదులలో, 20 మసీదులు ప్రార్థనకు ముందు భక్తులు అభ్యంగన కోసం ఉపయోగించే నీటిని రీ ఛార్జి చేయ‌డానికి మ‌ళ్లిస్తున్నారు. ఇంకుడు గుంట‌ల మాదిరిగా వాటిని నీటి మ‌ళ్లీ ఉప‌యోగించుకోవ‌డం ద్వారా భూ గ‌ర్భ జ‌లాల‌ను పెంచ‌డానికి మ‌సీదుల్లో ఏర్పాట్లు చేశారు. ఆ మేర‌కు అథర్ జమాత్ అధ్యక్షుడైన షా నవాజ్ వెల్ల‌డించాడు.

Also Read: ఈ స్టార్స్ అందరూ.. ఒక యాక్టింగ్ స్కూల్ లోనే ట్రైన్ అయ్యారు!

తమిళనాడులో కరువు సమయంలో (2016-17) మసీదులో మూడు బోర్‌వెల్‌లు ఎండిపోయాయ‌ట‌. ఆ స‌మ‌యంలో మసీదు ట్యాంకర్లపై ఆధారపడవలసి వచ్చింది. రోజుకు 8000 రూపాయలు ఖ‌ర్చు చేయాల్సి వ‌చ్చింది. అప్పుడు యాజమాన్యం చొరవ తీసుకుని అభ్యంగ‌నంకు వినియోగించే నీటిని మళ్లించి నిరుపయోగంగా ఉన్న బావికి రీచార్జి చేసింది.


‘‘సుమారు రూ. 20,000 వెచ్చించి మసీదులో నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి.ఇలా చేయ‌డాన్ని చూసిన మిగిలిన వాళ్లు రీ చార్జి బావిలోకి అభ్యంగ‌న నీటిని పంపించ‌డం ప్రారంభించార‌ని జమాతే ఇస్లామీ హింద్ (కోయంబత్తూరు) ప్రజా సంబంధాల కార్యదర్శి ఎం అబ్దుల్ హక్కీమ్ అన్నారు.

Also Read: చంద్ర‌యాన్ 2 రోవ‌ర్ క‌క్ష్యలో మార్పులు – ఇస్రో