Guinness Family Of India : ఆ కుటుంబం వరల్డ్ రికార్డులతో అదుర్స్ అనిపిస్తోంది. ఆ ఫ్యామిలీ నుంచి ఏకంగా ముగ్గురికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. దీంతో ‘గిన్నిస్ ఫ్యామిలీ ఆఫ్ ఇండియా’గా పేరొచ్చింది. కేరళలోని మలప్పురానికి చెందిన అబ్దుల్ సలీం కుటుంబం గురించి విశేషాలివీ..
Also Read : Pushpa Dialogue Horror : ‘పుష్ప’ డైలాగ్స్ చెప్పి.. బాలుడి గన్ ఫైర్.. ఇద్దరికి తీవ్ర గాయాలు
- అబ్దుల్ సలీం తొలిసారి చేతులు ఉపయోగించకుండా 17.82 సెకన్లలో అరటిపండును తిన్నారు. తద్వారా మొదటిసారి గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కారు. తద్వారా 2021లో ఇంగ్లండ్‌కు చెందిన లేహ్ షట్ కేవర్ 20.33 సెకన్లతో నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టారు.
- ఈ ఏడాది మొదట్లో 9.7 సెకన్లలో అరటిపండును తిని అబ్దుల్ సలీం(Guinness Family Of India) రికార్డును ఫవాజ్ బద్దలుకొట్టారు.
- ఈ ఏడాది జులై 30న అబ్దుల్ సలీం చేతులను ఉపయోగించకుండా 8.57 సెకన్లలోనే మొత్తం అరటిపండును తినేసి గిన్నిస్ రికార్డును సాధించారు. దీంతో గిన్నిస్ బుక్ రికార్డు మళ్లీ ఆయన కైవసం అయింది.
- 2023లో 34.17 సెకన్లలో పసి పిల్లలు పాలు తాగే బాటిల్‌తో 2.50 లీటర్ల నీటిని తాగి అబ్దుల్ సలీం గిన్నిస్ రికార్డును సాధించారు.
Also Read :Delhi Elections 2025: ఆప్ మరో జాబితా.. కాంగ్రెస్ కంచుకోటలో కేజ్రీవాల్ పోటీ
- అబ్దుల్ సలీం ఒక్క నిమిషంలో 24 టమాటాలను ముక్కలు కోయడం, చేతులతో ముట్టుకోకుండా కప్ కేక్‌ను తినడం వంటివి సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు.
- అబ్దుల్ సలీం కుమార్తె జువేరియా తన మోచేతులు, మోకాళ్లపై నడుస్తూ తలపై చేయిని ఉంచుతూ 54 మెట్లు ఎక్కింది.
- అబ్దుల్ సలీం మరో కుమార్తె ఆయెషా సుల్తానా 16.50 సెకన్లలో ఆరోహణ, అవరోహణ క్రమంలో పుస్తకాలను అమర్చడం ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది.
- అబ్దుల్ సలీం భార్య రషీద ‘మోస్ట్ స్టెప్-అప్స్’ విభాగంలో శిక్షణ తీసుకుంటోంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించేందుకు రెడీ అవుతోంది.
- అబ్దుల్ సలీం మేనకోడలు కూడా కొత్త రికార్డును నెలకొల్పేందుకు ట్రైనింగ్ తీసుకుంటున్నారు.
- గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన కేరళకు చెందిన 65వ వ్యక్తిగా అబ్దుల్ సలీం రికార్డును సొంతం చేసుకున్నారు.
- మలప్పురం నుంచి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించిన మూడో వ్యక్తి అబ్దుల్ సలీం.