Meena : బీజేపీలో చేరనున్న వెటరన్ హీరోయిన్?

Meena : ముఖ్యంగా 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె బీజేపీ తరఫున పోటీ చేయబోతున్నారనే వార్తలు పుకార్లుగా చక్కర్లు కొడుతున్నాయి

Published By: HashtagU Telugu Desk
Meena Bjp

Meena Bjp

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అగ్ర నటి గా పేరొందిన వెటరన్ హీరోయిన్ మీనా (Meena) ఇప్పుడు రాజకీయ అరంగేట్రానికి సిద్ధమవుతున్నారని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆమె భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధనఖడ్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఆమె రాజకీయ రంగప్రవేశంపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. గత కొన్ని నెలలుగా ఆమె రాజకీయ నాయకులతో కలుసుకుంటున్న వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి.

Sarpanch Elections: పంచాయతీ ఎన్నికలపై వీడ‌నున్న ఉత్కంఠ‌.. రేపు హైకోర్టు తీర్పు!

ఈ నేపథ్యంలో మీనా భారతీయ జనతా పార్టీ (BJP) లో చేరబోతున్నారని, త్వరలోనే ఆమె పార్టీలోకి అధికారికంగా ఎంట్రీ ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె బీజేపీ తరఫున పోటీ చేయబోతున్నారనే వార్తలు పుకార్లుగా చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటివరకు దీనిపై మీనా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే బీజేపీ నేతలు ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

DGCA : ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్ : పలు కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ

మీనా చిన్న తనంలోనే సినిమారంగం ప్రస్థానం ప్రారంభించి, దశాబ్దాల పాటు అగ్రహీరోయిన్ గా వెలుగొందారు. నటిగా మాత్రమే కాకుండా మంచి మనిషిగా, మాధ్యమాలతో గౌరవంగా ప్రవర్తించే వ్యక్తిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. ఇటువంటి వ్యక్తిత్వం గల మీనా రాజకీయాల్లోకి రావడం బీజేపీకి ఇమేజ్ పరంగా బలం కలిగించే అంశంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఆమె రాజకీయ ప్రయాణం ఎప్పుడు, ఎలా మొదలవుతుందనేది చూడాల్సిందే.

  Last Updated: 25 Jun 2025, 09:22 AM IST