India-Japan: భారత్-జపాన్ బంధంలో కొత్త అధ్యాయం

భారత్‌పై ఎక్కువ ఉగ్రదాడులు చేసే లష్కరే తోయిబా, జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాద సంస్థలను మట్టుబెట్టడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. జపాన్ ప్రధాని భారత పర్యటనలో భాగంగా ఉగ్రవాదంపై మాట్లాడారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని తకైచి పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించారు. లష్కరే తోయిబా, జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాద సంస్థలపై సమన్వయంతో కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. భారత్ – జపాన్ 16వ వార్షిక […]

Published By: HashtagU Telugu Desk
A new chapter in India-Japan relations

A new chapter in India-Japan relations

భారత్‌పై ఎక్కువ ఉగ్రదాడులు చేసే లష్కరే తోయిబా, జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాద సంస్థలను మట్టుబెట్టడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. జపాన్ ప్రధాని భారత పర్యటనలో భాగంగా ఉగ్రవాదంపై మాట్లాడారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని తకైచి పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించారు. లష్కరే తోయిబా, జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాద సంస్థలపై సమన్వయంతో కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

భారత్ – జపాన్ 16వ వార్షిక శిఖరాగ్ర సమావేశం అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో గతేడాది జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిని ఇరు దేశాల నేతలు ఖండించారు. అలాగే 2025 నవంబర్‌లో ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనను కూడా మోదీ, తకైచి తీవ్రంగా ఖండించారు. ఈ దారుణ ఘటనలకు నిర్వాహకులు, నిధులు సమకూర్చిన వారందరినీ అంతర్జాతీయ చట్టం ముందు నిలబెట్టాలని కోరారు. ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా, ముఖ్యంగా పాకిస్థాన్ నుంచి సరిహద్దు దాటి జరుగుతున్న ఉగ్రవాదాన్ని ఖండించాలన్నారు.

తకైచి జపాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె తొలి భారత పర్యటన ఇదే. దాంతో ఇరు దేశాల మధ్య ఆర్థిక, వ్యూహాత్మక, రక్షణ, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించేందుకు నేతలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జూలై 1 నుంచి 3వ తేదీ వరకు ఆమె భారత పర్యటనలో ఉండనున్నారు. హైదరాబాద్ హౌస్‌లో జరిగిన ద్వైపాక్షిక చర్చల అనంతరం తకైచిని మోదీ ఆప్యాయంగా చిన్ని చెల్లెలు అంటూ సంబోధించారు.

మోదీ వ్యాఖ్యలకు స్పందించిన ప్రధాని తకైచి భారత్ – జపాన్ సంబంధాలను అన్నాచెల్లెళ్ల అనుబంధంలా మరింత బలోపేతం చేస్తామంటూ చెప్పారు. తన ప్రసంగాన్ని ముగిస్తూ మోదీ హిందీలో ‘బహుత్ బహుత్ ధన్యవాద్’, జపనీస్‌లో ‘అరిగతో గోజైమాసు’ అంటూ థాంక్స్ చెప్పారు. ఈ ఇరు దేశాల నేతల మధ్య జరిగిన కీలక భేటీతో భవిష్యత్తులో భారత్‌కు మరింత సాంకేతికత అందే అవకాశం ఉంది.

 

  Last Updated: 03 Jul 2026, 11:11 AM IST