Site icon HashtagU Telugu

Tribal Girl: క‌ట్టునాయ‌కన్ తెగ నుంచి బీటెక్ పూర్తి చేసిన మొద‌టి మ‌హిళ ఈమె…!

Whatsapp Image 2021 12 04 At 20.42.10 Imresizer

kerala tribal girl

కేర‌ళ రాష్ట్రంలో క‌ట్టునాయ‌క‌న్‌ తెగ నుంచి బిటెక్ ప‌ట్టా పొందిన మొద‌టి వ్య‌క్తిగా శృతిరాజ్ నిలిచింది. క‌ట్టికుళంలోని చేలూర్ లో నేతాజీ గిరిజ‌న కాల‌నీకి చెందిన ఆమె త‌న ప‌ట్టుద‌ల‌తో బిటెక్ చ‌దివింది.శృతిరాజ్ దీనికోసం ఎన్నో వ్య‌య‌ప్ర‌యాస‌లు ప‌డింది.
శృతి రాజ్ త‌ల్లిదండ్రులు పేరు రాజు-సునీత.వీరిద్ద‌రు రోజువారీ కూలీ చేసుకుంటూ జీవితం గ‌డుపుతున్నారు.

ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షల్లో 86 శాతం మార్కులు సాధించిన శృతిరాజ్‌.. ఉన్న‌త చ‌దువులు చ‌దివేందుకు ఆమెకు ప‌లువురు చేయూత నిచ్చారు. ఆమె కత్తికుళంలోని ప్రభుత్వ హెచ్‌ఎస్‌ఎస్‌లో 10వ తరగతి వరకు చదివింది… మనంతవాడిలోని ప్రభుత్వ ఒకేషనల్ హెచ్‌ఎస్‌ఎస్‌లో ప్లస్ టూ చదివింది. 2014-18లో వాయనాడ్‌లోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్‌లో బీటెక్ కోర్సులో చేరింది. బిటెక్ లోఆమె ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. మైక్రోప్రాసెసర్ & కంట్రోలర్ పేపర్‌ను క్లియర్ చేయాల్సి వచ్చింది. త‌న‌ మొదటి రెండు ప్రయత్నాల్లో విఫల‌మైంది. ఆమె మూడవ ప్రయత్నంలో సబ్జెక్ట్‌ను క్లియర్ చేసింది. 60 శాతం మార్కులతో బీటెక్‌ పూర్తి చేసిన శృతిరాజ్‌…త‌న క‌మ్యూనిటీలో చాలా మంది విద్యార్థులు చ‌దువును ఆపేసిన‌ప్ప‌టికీ తాను మాత్రం బీటెక్ పూర్తి చేసి త‌న ఘ‌న‌త‌ని సాధించింది. బిటెక్ అనంత‌రం ప్రభుత్వ రంగంలో ఉద్యోగం సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంది . ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు సిద్ధమవుతోంది.

కట్టునాయకన్ తెగ ప్రధానంగా వయనాడ్, నిలంబూర్ మరియు పాలక్కాడ్ అటవీ ప్రాంతాలలో విస్తరించి ఉందని వాయనాడ్‌లోని ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం యొక్క జిల్లా ప్రాజెక్ట్ అధికారి కె సి చెరియన్ తెలిపారు. ఇప్పటివరకు ఆ క‌మ్యూనిటీలో బీటెక్‌ కోర్సు పూర్తి చేసిన ఏ విద్యార్థి గురించి మాకు సమాచారం అందలేదని…ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తి శృతిరాజ్ గా నిలిచింద‌న్నారు.

Exit mobile version