Site icon HashtagU Telugu

First Private Train : దేశంలోనే తొలి ప్రైవేటు రైలు.. ఏ రూట్లలో నడుస్తుందో తెలుసా ?

First Private Train

First Private Train

First Private Train : మన దేశంలో ప్రైవేటు రైళ్ల పరుగులకు తొలి బీజం పడబోతోంది. ఎక్కడో తెలుసా ? కేరళలో !!  జూన్ 4న కేరళలోని తిరువనంతపురం నుంచి గోవా వైపుగా తొలి ప్రైవేట్ రైలు పరుగులు తీయనుంది. ఈ రూట్‌లో త్రివేండ్రం, కొల్లాం, కొట్టాయం, ఎర్నాకులం, త్రిసూర్, కోజికోడ్, కన్నూర్, కాసర్‌గోడ్‌ సహా పలు స్టేషన్‌లలో రైలు హాల్టింగ్స్ ఉన్నాయి. భారత్ గౌరవ్ యాత్ర ప్రాజెక్టులో భాగంగా  ఈ ప్రైవేటు ట్రైనును నడుపుతారు.  కేంద్ర రైల్వే శాఖ, ప్రిన్సి వరల్డ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త సహకారంతో ఎస్‌ఆర్ఎంపీఆర్(SRMPR) గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ ప్రైవేటు రైలు సర్వీసును లీజుపై నిర్వహించనుంది. రైలును, దానిలోని సౌకర్యాలను ఎస్‌ఆర్ఎంపీఆర్ నిర్వహించనుండగా.. ఆ ట్రైనుకు సంబంధించిన టికెటింగ్, మార్కెటింగ్ బాధ్యతలను ప్రిన్సి ట్రావెల్స్ పర్యవేక్షించనుంది. తదుపరిగా ముంబై, అయోధ్య రూట్‌లోనూ ఈ ప్రైవేటు ట్రైన్‌ను నడపాలని ప్లాన్ చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join

Also Read :KCR Vs Modi : నా అరెస్టుకూ మోడీ కుట్ర.. కేసీఆర్ సంచలన ఆరోపణ

Also Read :RRR : రీ రిలీజ్‌కి సిద్దమైన ఆర్ఆర్ఆర్.. ఎప్పుడంటే..