కేరళ ప్రభుత్వం (Kerala Govt) మహిళల ఆరోగ్య రక్షణలో మరో అడుగు ముందుకేసింది. దేశంలో తొలిసారిగా మహిళల కోసం ప్రత్యేకంగా ‘స్త్రీ’ ఆరోగ్య క్లినిక్‌లను(STHREE) ప్రారంభించనుంది. మొత్తం 5,415 ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి మంగళవారం ఈ క్లినిక్‌లు నిర్వహించబడతాయి. రక్తహీనత, మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి మహిళల్లో సాధారణంగా కనిపించే వ్యాధులను ముందుగానే గుర్తించడం వీటి ప్రధాన లక్ష్యం. అదేవిధంగా, పిల్లలకు కూడా వైద్య సేవలు అందించనున్నారు. ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 16న ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తిరువనంతపురం జిల్లాలో ప్రారంభించనున్నారు.
Beggars Homes: బెగ్గర్స్ హోమ్స్ జైళ్ల కంటే దారుణం.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!
హీమోఫీలియా చికిత్సలోనూ కేరళ కొత్త చరిత్ర సృష్టించింది. తొలిసారిగా ఒక మహిళా హీమోఫీలియా రోగికి ‘ఎమిసిజుమాబ్ ప్రోఫైలాక్సిస్ చికిత్స’ అందించడం ద్వారా వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. త్రిస్సూర్ మెడికల్ కాలేజీ నిపుణుల పర్యవేక్షణలో 32 ఏళ్ల మహిళకు ఈ చికిత్స అందించబడింది. గతంలో రక్తస్రావ సమస్యల వల్ల గర్భాశయం, అండాశయాలు తొలగించుకోవాల్సి వచ్చిన ఆ మహిళకు ఇప్పుడు ఈ చికిత్స ఉపశమనం కలిగిస్తోంది. మహిళల్లో అధిక రక్తస్రావ సమస్యలను గుర్తించి, ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించిన తొలి రాష్ట్రంగా కూడా కేరళ నిలిచింది.
రాష్ట్ర ప్రభుత్వం ‘ఆశాధారా పథకం’ ద్వారా ఈ చికిత్సను ఉచితంగా అందిస్తోంది. 18 ఏళ్లలోపు ఉన్న హీమోఫీలియా రోగులకు కూడా ఉచిత ఔషధాలు అందించడంలో కేరళ ముందంజలో ఉంది. ప్రస్తుతం 500 మందికి పైగా రోగులు ఈ సదుపాయం పొందుతున్నారు. హీమోఫీలియా అనేది అరుదైన వంశపారంపర్య వ్యాధి, రక్తం గడ్డకట్టే ఫ్యాక్టర్లు లేకపోవడం వల్ల అదుపు లేని రక్తస్రావం జరుగుతుంది. సాధారణంగా ఇది పురుషుల్లో కనిపించినా, మహిళల్లో చాలా అరుదుగా ప్రదర్శిస్తుంది. కేరళ తీసుకుంటున్న ఈ చర్యలు మహిళా, శిశు ఆరోగ్య రంగాల్లో ఆదర్శంగా నిలుస్తున్నాయి.
Panchmukhi Hanuman Ji: మంగళవారం రోజు పంచముఖ ఆంజనేయ స్వామి పూజ చేయండిలా!
