Sunny Leone : బాలీవుడ్ నటి 43 ఏళ్ల సన్నీ లియోన్‌కు కేరళ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ (వీసీ) డాక్టర్ మోహనన్ కున్నుమ్మల్ షాకిచ్చారు. జూలై 5న కేరళ రాజధాని తిరువనంతపురంలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ క్యాంపస్‌లో తలపెట్టిన సన్నీ లియోన్ డ్యాన్స్ షోకు ఆయన అనుమతి ఇచ్చేందుకు నిరాకరించారు. ఆమె డ్యాన్స్ షోను ప్రోగ్రామ్ లిస్ట్‌లో చేర్చొద్దని వీసీ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల అమలును పర్యవేక్షించాలని యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు మోహనన్ కున్నుమ్మల్ నిర్దేశించారు. గత ఏడాది నవంబర్‌లో కేరళలోని ఎర్నాకులం జిల్లాలో ఉన్న కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (కుశాట్)లో జరిగిన ఒక డ్యాన్స్ షోలో తొక్కిసలాట జరిగి నలుగురు విద్యార్థులు చనిపోయారు. 60 మందికిపైగా గాయపడ్డారు. ఆనాటి ఘటన విషాదాన్ని మిగిల్చిన నేపథ్యంలో మళ్లీ అటువంటి ప్రాణనష్టం జరగకూడదనే ఉద్దేశంతోనే సన్నీ లియోనీ డ్యాన్స్ షోకు యూనివర్సిటీ వీసీ అనుమతిని నిరాకరించారని తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join
సన్నీ లియోన్ బర్త్ డే.. సెలబ్రేట్ చేసుకున్న యువకులు
సన్నీలియోన్(Sunny Leone) మే 13న తన 43వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. ఆసందర్భంగా గత నెలలో ఆమె అభిమానులు కేక్ కట్ చేసి అన్నదానాలు చేశారు. కర్నాటకలోని కర్కల్లికి చెందిన యువకులు సన్నీ లియోన్ పుట్టినరోజు వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. సన్నీలియోన్ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేసి.. అక్కడి వారంతా కేక్ కట్ చేశారు. ఈ యువకుల బృందం తమను తాము కర్కల్లి బాయ్స్ అని పిలుస్తారు. సన్నీ చేస్తున్న సామాజిక సేవతో పాటు ఆమెలో ఉన్న దాతృత్వమే తమను అభిమానులుగా మార్చిందని వారు అంటున్నారు. అశ్లీల సినిమాలు, వీడియోలతో సన్నీ లియోన్ చాలా పాపులర్ అయింది. తద్వారా ఆమె బాగానే డబ్బులు సంపాదించింది. ప్రస్తుతం ఆమె ఓ అమెరికా వ్యక్తిని పెళ్లాడి.. ఆ దేశంలోనే ఉంటోంది. ఇటువంటి వారిని ఆరాధించేలా యువత మారడం.. దిగజారిపోతున్న నైతిక విలువలకు నిలువుటద్దం అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.