Kerala Shocker : సభ్యసమాజం తలదించుకునే అమానుష ఘటన వెలుగుచూసింది. 18 ఏళ్ల అథ్లెట్‌పై దాదాపు 60 మందికిపైగా వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఒకరోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఏకంగా ఐదేళ్లపాటు ఆమెను కామాంధులు వేధించారు. కేరళలో చాలా ఆలస్యంగా వెలుగుచూసిన ఈ అమానుషం వివరాలివీ..
Also Read :Police Personnel Suicides : పోలీసు సిబ్బంది సూసైడ్స్ కలకలం.. వ్యక్తిగత కారణాలు, ఉద్యోగ ఒత్తిడి వల్లే!
గత ఐదేళ్లుగా తాను అనుభవించిన చిత్రవధ గురించి సదరు బాలిక ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీకి(Kerala Shocker) ఫిర్యాదు చేసింది. దీనిపై కేరళలోని పథనంథిట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును మొదలుపెట్టారు. 13 ఏళ్ల వయసులోనే తనపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె తెలిపింది. అప్పట్లో తమ పొరుగు ఇంట్లో ఉండే ఒక వ్యక్తి తనను కొండల ప్రాంతానికి తీసుకెళ్లి, స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేశాడని సదరు బాలిక ఆరోపించింది. వారంతా కలిసి తనకు బలవంతంగా పోర్న్ వీడియోలు చూపించారని ఆవేదన వ్యక్తం చేసింది.
Also Read :Hyderabad To Vijayawada : విజయవాడ మార్గంలో వాహన రద్దీ.. ఈ దారుల్లో వెళ్తే సాఫీగా జర్నీ
తాను అథ్లెట్‌గా మారిన తర్వాత.. కొందరు అథ్లెటిక్ కోచ్‌లు, తోటి ఆటగాళ్లు కూడా తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె వాపోయింది. ఈవిషయాలను బయటికి చెబితే ఏదైనా చేస్తారనే భయంతోనే ఇన్నాళ్లూ మౌనంగా ఉండిపోయానని ఆ బాలిక వెల్లడించింది. ఈ వ్యవహారంలో పోలీసులు 62 మంది అనుమానితులను గుర్తించగా, వారిలో ఐదుగురిని అరెస్టు చేశారు. 62 మందిలో 40 మందిపై పోక్సో చట్టం కింద కేసులు పెట్టారు. బాధితురాలు ప్రస్తుతం షెల్టర్ హోంలో సురక్షితంగా ఉంది. ఆమెకు తగిన కౌన్సెలింగ్ చేసిన మనోస్థైర్యాన్ని అందించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ ప్రకటించింది. తాను ఎదుర్కొన్న దారుణాలను సదరు బాలిక సాహసం చేసి బయటికి చెప్పడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. ఇలాంటి అమానుషాలను అరికట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు.