Rooster Crow : విచిత్రమైన ఘటన అంటే ఇదే. పక్కింట్లో ఉన్న కోడి వల్ల తనకు మనశ్శాంతి లేకుండా పోయిందంటూ ఓ వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేశాడు. కోడి ప్రతిరోజు తెల్లవారుజామున మూడు గంటలకు కూస్తోందని, దానివల్ల తన నిద్ర చెడిపోతోందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. వివరాలివీ..
Also Read :Hyderabad Real Estate : హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు డౌన్.. ‘రియల్’ సంక్షోభం
పక్కింట్లోనే ఉండే..
ఈ ఘటన వివరాలు తెలియాలంటే మనం కేరళలోని పతనంతిట్ట జిల్లా పల్లికల్ గ్రామానికి వెళ్లాలి. అక్కడ రాధాకృష్ణ కురుప్, అనిల్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య చిన్న విషయానికే గొడవ జరిగింది. వీళ్లిద్దరి ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. అనిల్ కుమార్‌కు చెందిన కోడి ప్రతిరోజూ తెల్లవారుజామున మూడు గంటలకే కూస్తోంది. దీనివల్ల పక్కింట్లోనే ఉండే తన నిద్రకు భంగం కలుగుతోందంటూ రాధాకృష్ణ కురుప్ అనే వృద్ధుడు.. అడూర్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసు (ఆర్‌డీఓ)లో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా అధికారులు విచారణ మొదలుపెట్టారు.
Also Read :India’s Smallest Passenger Train : కేవలం 9 కి.మీ నడిచే ట్రైన్ ఉందని మీకు తెలుసా..?
ఇంటి పైఅంతస్తులోని కోడిని..
ఈక్రమంలో రాధాకృష్ణ కురుప్, అనిల్ కుమార్‌లను ఆర్‌డీఓ ఆఫీసుకు పిలిపించి మాట్లాడారు. అసలు సమస్యేంటో అడిగి తెలుసుకున్నారు. తదుపరిగా అధికారులు వెళ్లి ఇద్దరి ఇళ్లను పరిశీలించారు. అనిల్ తన ఇంటి పైఅంతస్తులో కోడిని(Rooster Crow) ఉంచినట్టు గుర్తించారు. ఒకటి, రెండు రోజుల పాటు తెల్లవారుజామునే రాధాకృష్ణ కురుప్, అనిల్ కుమార్ ఇళ్లకు అధికారులు వెళ్లారు. తెల్లవారుజామునే మూడు గంటలకు కోడి కూస్తున్నట్లు వారి పరిశీలనలో వెల్లడైంది. అనిల్ ఇంటి పైఅంతస్తులో ఉన్న కోళ్ల షెడ్‌ను.. అతడి ఇంటి దక్షిణ భాగం వైపునకు మార్చాలని అధికారులు ఆదేశించారు. ఈమేరకు మార్పులు చేసేందుకు అనిల్‌కు 14 రోజుల గడువు ఇచ్చారు. మొత్తం మీద ఈ కోడికూత వివాదం పల్లికల్ గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై కూడా ఈవిధంగా కంప్లయింట్లు ఇచ్చుకుంటారా అని స్థానికులు చర్చించుకుంటున్నారు.