Site icon HashtagU Telugu

Chief Minister’s convoy Accident : CM కాన్వాయ్​కి ప్రమాదం..

Kerala Cm Convoy Accident

Kerala Cm Convoy Accident

కేరళ సీఎం (Kerala CM) పినరయివిజయన్ (Pinarayi Vijayan) కాన్వాయ్‌(Convoy )కి పెనుప్రమాదం జరిగింది. తిరువనంతపురంలోని వామనపురంలో సీఎం కాన్వాయ్ కి ఓ స్కూట‌ర్ అడ్డు రావడం తో ఎస్కార్ట్ లోని మొదటి బండి సడెన్ బ్రేక్ వేసింది. దాంతో వేణుక‌ వస్తున్న ఎస్కార్ట్ బండ్లు అన్ని ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో మొత్తం ఐదు ఎస్కార్ట్ వాహనాలు ధ్వంసం కాగా.. సీఎం పినరయివిజయన్‌కు ఏమి కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది.

ఒక మహిళ స్కూటీపై వెళ్తుండగా, ఆమె రోడ్డులో మలుపు తీసుకుంటున్న సందర్భంలో వెనుక నుంచి వచ్చిన పోలీసు వాహనం ఒక్కసారిగా ఆగడం వల్ల కాన్వాయ్ లోని వాహనాలు ఎదుర్కొంటూ వరుసగా ఐదు వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకున్నాయి. ఈ ఢీ కొట్టడంలో అంబులెన్స్ కూడా స్వల్పంగా దెబ్బతిన్నది.

అయితే, వెంటనే భద్రతా సిబ్బంది స్పందించి, ముఖ్యమంత్రి కారును తనిఖీ చేసి, డ్యామేజ్ ఎక్కువగా లేకపోవడంతో ఆయన్ను అదే వాహనంలో పయనింపజేశారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. నడిరోడ్డుపై సీఎం కాన్వాయ్ ప్రమాదానికి గురికావడంతో స్థానికులు కాస్త ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన కు సంబదించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

Read Also : ANR National Award 2024 : చిరంజీవి చెప్పిన మాటలకు అక్కినేని ఫ్యామిలీ ఫిదా..!