Site icon HashtagU Telugu

KCR: కర్ణాటక స్టోరీపై కేసీఆర్ తెలంగాణ స్క్రీన్ ప్లే

KCR New Scheme

Kcr Telangana Screenplay On Karnataka Story

KCR Screenplay on Karnataka Story : తెలంగాణ ప్రజలకు కేసీఆర్ (KCR), బీ ఆర్ ఎస్ (BRS) తప్ప మరో గతి లేదనే పొలిటికల్ కోణం బయటకు వస్తుంది. ఆ విషయాన్ని మండలి చైర్మన్ గుట్ట సుఖేందర్ రెడ్డి చెప్పడం గమనిస్తే బుధవారం (17వ తేదీ) జరిగే కేసీఆర్ (KCR) మీటింగ్ ఎజెండా ఏమిటో అర్థం అవుతుంది. కర్ణాటక సీన్ రిపీట్ అవుతుందని కాంగ్రెస్ చెబుతుంది. ప్రజలు కూడా కర్ణాటక ఫలితాలు తరువాత నమ్మేలా ఉన్నారని భావిస్తుంది. అందుకే , కాంగ్రెస్ పార్టీ గురించి దానిలోని కుమ్ములాటలపై ఫోకస్ పెట్టారు. అధికారం ఇచ్చినా ప్రభుత్వం ఏర్పాటు కు కర్ణాటకలో కాంగ్రెస్ ఏమి చేస్తుందో చూదాలని బీ ఆర్ ఎస్ (BRS) చెబుతుంది. కాంగ్రెస్ కి ఓటు వేస్తే మురిగిపోయినట్టేనని గుత్తా స్లో గన్ అందుకున్నారు. ఇక బీజేపీ కర్ణాటకలో చావు దెబ్బ తిన్నదని, తెలంగాణలో ఆ పార్టీకి చోటులేదని చెబుతున్నారు. గత 2014, 2019 ఎన్నికల్లో పొత్తు లేకుండా సీఎం అయిన కేసీఆర్ (KCR) ఈ సారి కూడా ఉభయ కమ్యూనిస్టుల మద్దతు లేకుండా 100 స్థానాల్లో గెలుస్తామని అంచనా వేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు బీ ఆర్ ఎస్ పార్టీ మాత్రమే శరణ్యం అంటూ సుఖేందర్ చెప్పటం చర్చనీయాంశం అయింది.

కర్ణాటక ఎన్నికల ఫలితాలతో తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు మారతాయని అంచనా వేస్తున్న క్రమంలో బుధవారం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో కెసిఆర్ భేటీ కానున్నారు. ఈ భేటీ రాష్ట్ర రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది. కర్ణాటకలో విజయం సాధించిన కాంగ్రెస్ తెలంగాణలో దూకుడు పెంచే అవకాశం ఉందన్న అంశంపై ఫోకస్ చేయనున్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధత, బీఆర్ఎస్ పార్టీ విస్తరణ, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవడం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఎన్నికల సమర శంఖారావం పూరించే వేదికలుగా మార్చుకోవడం తదితర అంశాలపై చర్చించనున్నారు. ఆ మేరకు ఆ పార్టీ వర్గాలు చెబుతున్న మాట.

పలు సర్వేల సారాంశాన్ని ఇటీవల జరిగిన మీటింగ్లో కేసీఆర్ సుచాయగా చెప్పారు. కనీసం 40 మంది ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డారని తేల్చారు. దళిత బంధులో దోపిడీ జరిగిన విషయాన్ని చెబుతూ వాళ్ళ జాబితా కూడా ఉందని హెచ్చరించారు. అంతే కాదు వాళ్లకు టిక్కెట్ ఇచ్చే ప్రసక్తే లేదని తెలుస్తోంది. ఆ విషయాన్ని కూడా తేల్చేస్తారని అవినీతి పరుల్లో దడ మొదలైంది. ప్రస్తుతానికి జాతీయ రాజకీయాలను దూరంగా పెట్టి రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేయనున్నారు. ఇంకా కేవలం 6 నెలల టైం ఉందని, ఈ సమయంలో అవినీతి బయటకు వస్తే నష్టం జరుగుతుందని జాగ్రత్తలు చెప్పానున్నారు.

జాతీయ నేతలను తెలంగాణాకు తీసుకు రావడం ద్వారా పొలిటికల్ గ్లామర్ పెంచుకోవాలని కేసీఆర్ చూస్తున్నారు. కర్ణాటకలో పరోక్షంగా వెలుపెట్టిన కేసీఆర్ కు జేడీఎస్ రూపంలో షాక్ తగిలింది. ఇక మహారాష్ట్ర లో బ్రోక్కర్ మార్కెట్ యార్డ్ ఎన్నికల్లో కర్రు కాల్చి బీ ఆర్ ఎస్ కు అక్కడి ఓటర్లు వాత పెట్టారు. దీంతో రాష్ట్రం వరకు పరిమితం కావాలని చూస్తున్నారు. ప్లాన్ బీ సంకేతాలు కూడా ఇవ్వడానికి బుధవారం మీటింగ్ కీలకం కానుంది. ఒక వేళ సాధారణ ఎన్నికల వరకు అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేస్తే కాంగ్రెస్, బీ ఆర్ ఎస్ పొత్తు ఉండేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల వరకు ముందు జరిగితే పొత్తు లేకుండా వెళ్లాలని ప్రణాళిక ఉందని పార్టీ వర్గాల్లోని టాక్. సంచలన నిర్ణయాలు, ప్రచార దిశానిర్దేశం చేయడానికి బుధవారం మీటింగ్ కేంద్రం కానుంది.

Also Read:  Avinash Reddy vs CBI : వివేకా హత్య కేసులో సీబీఐ కి అవినాష్ రెడ్డి మరో జలక్

Exit mobile version