Karnataka Election:క‌ర్ణాట‌క కాంగ్రెస్ కు ఆ న‌లుగురితో డేంజ‌ర్

క‌ర్ణాట‌క(Karnataka Election)కాంగ్రెస్ గ్రూప్ రాజ‌కీయాల‌కు కేంద్రంగా మారింది.

  • Written By:
  • Updated On - April 12, 2023 / 12:57 AM IST

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో (Karnataka Election) కాంగ్రెస్ గ్రూప్ రాజ‌కీయాల‌కు(Congress groups) కేంద్రంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా అక్క‌డ కూడా సీఎం అభ్య‌ర్థిత్వాన్ని ఆశిస్తోన్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది. ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ శివ‌కుమార్‌, మాజీ సీఎం సిద్ది రామ‌య్య‌, ప‌ర‌మేశ్వ‌ర్ సీఎం అభ్య‌ర్థి రేస్ లో ఉన్నారు. అయితే, ఎన్నిక‌లు ముగిసిన త‌రువాత మాత్ర‌మే కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్య‌ర్థిని సీల్డ్ క‌వ‌ర్ లో పంపించే సంస్కృతి ఉంది. ఫ‌లితంగా గ్రూప్ ల వ్య‌వ‌హారం క‌ర్ణాట‌క కాంగ్రెస్ లో పొడ‌చూపుతోంది.

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో  కాంగ్రెస్ గ్రూప్ రాజ‌కీయాల‌కు…(Karnataka Election)

తాజా స‌ర్వేల ప్ర‌కారం క‌ర్ణాట‌క రాష్ట్రంలో (Karnataka Election) కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. అందుకే, అక్క‌డ అంత‌ర్గ‌త గ్రూప్ లు(Congress groups) యాక్టివ్ అవుతున్నాయి. ప్ర‌స్తుతం మాజీ సీఎం సిద్ధి రామ‌య్య వ‌రుణ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల్సి ఉంది. అయితే, ఆయ‌న కోలార్ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఆశిస్తున్నారు. ఏఐసీసీ విడుద‌ల చేసిన మొద‌టి జాబితాలో వ‌రుణ నుంచి సిద్ధి రామ‌య్య‌ను అధిష్టానం ఫైన‌ల్ చేసింది. రెండు స్థానాల్లోనూ పోటీ చేసే అవ‌కాశం ఇవ్వాల‌ని ఆయ‌న కోరుకుంటున్నారు. లేదంటే, కోలార్ నుంచి పోటీ చేయ‌డానికి సిద్ద‌మ‌ని సంకేతాలు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే, సీఎం అభ్య‌ర్థి కోసం ప‌రమేశ్వ‌ర్, శివ‌కుమార్ పోటీ ప‌డ‌డంలో త‌ప్పులేద‌ని ఒక జాతీయ ప్రైవేటు ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సిద్ధిరామ‌య్య వెల్ల‌డించారు.

సీఎం ప‌ద‌విని ఆశిస్తున్నాన‌ని సిద్ధిరామ‌య్య

సీఎం ప‌ద‌విని ఆశిస్తున్నాన‌ని సిద్ధిరామ‌య్య బాహాటంగా చెబుతున్నారు. ఇవే త‌న చివ‌రి ఎన్నిక‌లుగా చెబుతున్నారు. అందుకే లాస్ట్ ఛాన్స్ ఇవ్వాల‌ని కోరుకుంటున్నారు. మ‌రో వైపు శివ‌కుమార్ సీఎం అభ్య‌ర్థిగా ఫోక‌స్ అవుతున్నారు. ప్ర‌స్తుతం పీసీసీ చీఫ్ గా అక్క‌డ ప‌నిచేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మైసూరులోని వరుణ స్థానం నుంచి బరిలోకి దిగారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాను కోలార్ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తానని చెప్ప‌డం తాజాగా క‌ర్ణాట‌క కాంగ్రెస్ లోని హాట్ టాపిక్ అయింది.

గాలి జనార్థ‌న్ రెడ్డి పార్టీ ప్రభావం (Karnataka Election)

ఎన్నిక‌ల క‌మిష‌న్ షెడ్యూల్ ప్ర‌కారం మే 10వ తేదీన క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు(Karnataka Election) జ‌రుగుతున్నాయి. అక్క‌డ ప్ర‌ధానంగా కాంగ్రెస్, బీజేపీ మ‌ధ్య పోటీ ఉంటుంద‌ని స‌ర్వేల సారాంశం. అంతేకాదు, జేడీఎస్ కింగ్ మేక‌ర్ గా నిలుస్తుంద‌ని కూడా కొన్ని స‌ర్వేలు అంచ‌నా వేస్తున్నాయి. వీటితో పాటు ఈసారి క‌ర్ణాట‌క ఎన్నిక‌ల బ‌రిలోకి ఆప్ సీరియ‌స్ గా దిగింది. ఇంకో వైపు గాలి జ‌నార్థ‌న్ రెడ్డి కొత్త‌గా పెట్టిన పార్టీ కూడా కొన్ని స్థానాల్లో ప్ర‌భావం చూప‌నుంది. ఉత్త‌ర క‌ర్ణాట‌క‌, ఏపీ , తెలంగాణ స‌రిహ‌ద్దుల్లోని కనీసం 25 స్థానాల్లో గాలి జనార్థ‌న్ రెడ్డి పార్టీ ప్రభావం ఉంటుంద‌ని ప్ర‌ధాన పార్టీలు అంచ‌నా వేస్తున్నాయి. ఇప్ప‌టికే ఆప్ త‌న ఓటు బ్యాంకు మేనిఫెస్టోల‌ను తెరిచింది. ఢిల్లీలో త‌ర‌హాలో 300 యూనిట్ల విద్యుత్ ను ఉచితంగా ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. స్థానికులకు ఉద్యోగాల్లో 80 శాతం, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు త‌దిత‌ర‌ 10 హామీలను ఇస్తూ అట్రాక్టివ్ మేనిఫెస్టోను విడుదల చేసింది.

ఇప్పుడు ద‌క్షిణాది రాష్ట్రాల‌కు ఆప్  

ప్ర‌ధానంగా నిరుద్యోగ స‌మ‌స్య‌ను గ‌మ‌నించిన ఆప్ క‌ర్ణాట‌క‌లోనూ యూత్ ను ఆక‌ర్షించేలా హామీల‌ను గుప్పించింది.కాంట్రాక్టు సిబ్బంది క్రమబద్ధీకరణతో పాటు ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతోంది. ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. గుజ‌రాత్, పంజాబ్ , గోవా ఎన్నిక‌ల్లో ఆప్ ప్ర‌భావాన్ని చూశాం. ఇప్పుడు ద‌క్షిణాది రాష్ట్రాల‌కు ఆ పార్టీ విస్త‌రించ‌డానికి ఎన్నిక‌ల‌ను టార్గెట్ గా చేసుకుంది. ఇక కొత్త‌గా జాతీయ వాదాన్ని వినిపిస్తోన్న కేసీఆర్ వ్య‌వ‌హారం మాత్రం ఉలుకుప‌లుకూ లేకుండా ఉంది.

క‌ర్ణాట‌క లో ఒక్క స‌భ‌కు కూడా బీఆర్ఎస్ ప్లాన్ చేయ‌లేదు

జేడీఎస్ ఒంట‌రిగా పోటీ చేయ‌డానికి సిద్ధ‌మ‌యింది. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవ‌డానికి జేడీఎస్ ఇష్ట‌ప‌డ‌డంలేదు. కింగ్ మేకర్ కావాల‌ని ప్ర‌య‌త్నం చేస్తోంది. అందుకే, కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ ను కూడా దూరంగా పెట్టింది. ఇటీవ‌ల జేడీఎస్, బీఆర్ఎస్ పార్టీ మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ‌ల ప్ర‌కారం ఆ రెండు పార్టీల మ‌ధ్య పొత్తు ఉండాలి. కానీ, క‌ర్ణాట‌క వైపు(Karnataka Election) కూడా కేసీఆర్ చూసే ప‌రిస్థితి క‌నిపించ‌డంలేదు. ప్ర‌స్తుతం మ‌హారాష్ట్రలో బ‌హిరంగ స‌భ‌ల‌ను పెడుతున్నారు. ఎన్నిక‌లు జ‌రుగుతోన్న క‌ర్ణాట‌క లో ఒక్క స‌భ‌కు కూడా బీఆర్ఎస్ ప్లాన్ చేయ‌లేదు. బీఆర్ ఎస్ ను ప్ర‌క‌టించిన త‌రువాత జ‌రిగిన గుజ‌రాత్, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లోనూ ఆ పార్టీ క‌నిపించ‌లేదు. ఇప్పుడు క‌ర్ణాట‌క‌లోనూ బీఆర్ఎస్ ప్ర‌స్తావ‌న రావ‌డంలేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆహ్వానం మేర‌కు జేడీఎస్ నేత‌, మాజీ సీఎం కుమారస్వామి తెలంగాణ‌కు వ‌చ్చిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం ఆ సఖ్య‌త క‌నిపించ‌డంలేదు.

Also Read : Karnataka Congress: కర్ణాటకలో ‘హస్తం’ గాలి.. కాంగ్రెస్‌‌కు కన్నడిగులు జై!

పాత మైసూరు ప్రాంతంలోని వొక్కలిగ ఓటు బ్యాంకు మీద జేడీఎస్ ఎక్కువ‌గా ఆధార‌ప‌డింది. కాంగ్రెస్, బీజేపీలు భారీగా ఓటు బ్యాంకును చీల్చుతుంద‌ని జేడీ(ఎస్) భావిస్తోంది. అందుకే, ఆ సామాజిక‌వ‌ర్గాన్ని పూర్తి స్థాయిలో సానుకూలంగా మ‌లుచుకోవ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తోంది. రాబోవు రోజుల్లో ఒక వేళ గాలి జ‌నార్థ‌న్ రెడ్డి పార్టీ (క‌ల్యాణ్ రాజ్య ప్ర‌గ‌తి ప‌క్ష‌)  , జేడీఎస్, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటాయా? అనే చ‌ర్చ కూడా న‌డుస్తోంది. అయితే, ప్ర‌ధానంగా కాంగ్రెస్, బీజేపీ మ‌ధ్య పోటీ ఉండ‌నుందని తెలుస్తోంది. ఇక ఎంఐఎం కూడా క‌ర్ణాట‌క ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌నుంద‌ని తెలుస్తోంది. ఫ‌లితంగా ఓటు చీలిపోవ‌డం ద్వారా కాంగ్రెస్ కు (Congress groups) అంతిమంగా న‌ష్టం జ‌రుగుతుంద‌ని ఒక అంచ‌నా. ఇక కాంగ్రెస్ పార్టీలోని సీనియ‌ర్లు సీఎం అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతూ పార్టీకి మైన‌స్ క‌లిగిస్తున్నార‌ని టాక్‌. ఇలాంటి ఆటంకాల‌ను దాటితే మాత్రం కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న స‌ర్వేలు నిజ‌మయ్యే అవ‌కాశం ఉంది. లేదంటే, పంజాబ్ త‌ర‌హా ఫలితాలు ఉండే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల అభిప్రాయం.

Also Read : Karnataka election : ఎన్నిక‌ల ప్ర‌చారానికి రాహుల్ స‌న్న‌ద్ధం