Site icon HashtagU Telugu

Karnataka Election :డీకే, సిద్ధితో క‌ర్ణాట‌క కాంగ్రెస్ తొలి జాబితా!

Karnataka Election

Karnataka Election 1

క‌ర్ణాట‌క కాంగ్రెస్ (Karnataka Election) దూకుడు మీద ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల తొలి జాబితాను(Candidates list) ప్ర‌క‌టించింది. మొత్తం 124 మంది అభ్య‌ర్థుల‌తో తొలి జాబితాను విడుద‌ల చేయ‌డం కాంగ్రెస్ పార్టీలో సంచ‌ల‌నంగా మారింది. ఆ జాబితాలో వ‌రుణ నియోజ‌క‌వ‌ర్గం నుంచి సిద్ధి రామ‌య్య‌, క‌న‌క‌పురం నుంచి డీకే శివ‌కుమార్ పోటీ చేస్తార‌ని స్ప‌ష్టం చేసింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మార్చి 25, శనివారం తన అభ్యర్థుల తొలి జాబి తాను విడుదల చేసింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌తో సహా కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి అగ్రనేతలు తొలి జాబితాలో అభ్య‌ర్థులుగా ఉన్నారు.

క‌ర్ణాట‌క కాంగ్రెస్ దూకుడు(Karnataka Election) 

(Karnatak Election) దావణగెరె సౌత్ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా 91 ఏళ్ల శామనూరు శివశంకరప్పను ఖరారు అయ్యారు. దేవనహళ్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత కేహెచ్ మునియప్పకు టికెట్ ఇచ్చారు. బెంగళూరుకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు కృష్ణ బైరేగౌడ, ఎన్‌ఎ హరీస్, కెజె జార్జ్, రిజ్వాన్ అర్షద్ మరియు దినేష్ గుండూరావులు సొంత నియోజకవర్గాల్లో ఎన్నికలకు అభ్యర్థులుగా(Candidates) తిరిగి బ‌రిలోకి దిగ‌నున్నారు.

వ‌రుణ నియోజ‌క‌వ‌ర్గం నుంచి సిద్ధి రామ‌య్య‌, క‌న‌క‌పురం నుంచి డీకే శివ‌కుమార్

రాష్ట్రంలో అభ్యర్థుల తొలి జాబితాను(Candidates) ఖరారు చేసేందుకు మార్చి 17న ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించింది. ముందుగా జాబితాను ఉగాది సందర్భంగా మార్చి 22న విడుదల చేయాలని భావించిన‌ప్ప‌టికీ వాయిదా ప‌డింది. సిద్ధరామయ్య నియోజకవర్గంపై నెలకొన్న అనిశ్చితి కారణంగానే ప్రకటన ఆలస్యమైంది. ఉగాది పండుగ సందర్భంగా వార్తాపత్రికలు ముద్రించకపోవడమే జాబితా విడుద‌ల వాయిదా ప‌డింద‌ని వ‌స్తోన్న న్యూస్ ను కాంగ్రెస్ నాయ‌కులు తోసిపుచ్చారు.

Also Read : Karnataka Assembly: అసెంబ్లీలో చెవిలో పువ్వుతో మాజీ సీఎం.. చాలా బాగుందన్న సీఎం

2018 ఎన్నికల్లో 224 స్థానాలున్న కర్ణాటక (Karnataka Elections) అసెంబ్లీలో 104 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా బీజేపీ అవ‌త‌రించంది. కాంగ్రెస్ 80 సీట్లు గెలుచుకోగా, 37 సీట్లు గెలుచుకున్న జనతాదళ్ (సెక్యులర్) అధికారం చేప‌ట్టింది. ఎన్నికల త‌రువాత కాంగ్రెస్, జేడీఎస్ పొత్తు పెట్టుకుని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విష‌యం విదిత‌మే. క్ర‌మంగా కాంగ్రెస్, జేడీ(ఎస్)ల నుంచి పలువురు అభ్యర్థులు (Candidates)ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేరడంతో 2019లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఉప ఎన్నికల తరువాత, రాష్ట్రంలో 1 స్వతంత్ర ఎమ్మెల్యేతో సహా 120 మంది ఎమ్మెల్యేల మద్దతు బిజెపికి ఉంది. కాంగ్రెస్ మరియు జెడి (ఎస్) ఎమ్మెల్యేల సంఖ్య వరుసగా 69 మరియు 30కి పడిపోయింది. ఈసారి వార్ ఒన్ సైడ్ ఉంటుంద‌ని స‌ర్వేలు అంచ‌నా వేస్తున్నాయి. ఆ క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ ముందుగా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డం ఎంత వ‌ర‌కు సానుకూల‌త అంశంగా మార‌నుంది? అనేది చూడాలి.

Also Read : Karnataka BJP : క‌ర్ణాట‌క బీజేపీలో మాజీ సీఎం యడుయూర‌ప్ప క‌ల‌క‌లం

రాహుల్ గాంధీ అన‌ర్హ‌త‌కు గురైన త‌రువాత ప్ర‌జాక్షేత్రంలోకి దూకుడుగా రాబోతున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఉన్న క‌ర్ణాట‌క , తెలంగాణ మీద ఎక్కువ‌గా రాహుల్ దృష్టి పెట్టే అవ‌కాశం ఉంది.