Site icon HashtagU Telugu

MUDA ‘Scam’ : హైకోర్టు ను ఆశ్రయించిన కర్ణాటక సీఎం

Karnataka Cm Siddaramaiah

Karnataka Cm Siddaramaiah

మైసూరు నగర అభివృద్ధి ప్రాధికార సంస్థ (MUDA) కుంభకోణం పై సీఎం సిద్ధరామయ్య (Karnataka CM Siddaramaiah)ను విచారించేందుకు కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఇటీవల ఆమోదం తెలుపడంతో రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. గవర్నర్ అనుమతి ఇచ్చినందున, సిద్ధరామయ్య అరెస్ట్‌ అవుతారని ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో, సిద్ధరామయ్య కర్ణాటక హైకోర్టును ఆశ్రయించి, గవర్నర్ ఆదేశాలను సవాల్ చేశారు. ఈ మేరకు ఆయన తన పిటిషన్‌ను హైకోర్టులో దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు త్వరలో విచారణ జరగనుంది. గతంలో, గవర్నర్‌ల అనుమతి పరిగణనలో భాగంగా విచారణ ఎదుర్కొన్న పలువురు ముఖ్యమంత్రులు అరెస్ట్ అయ్యారు. దీంతో సిద్ధరామయ్య కూడా అరెస్ట్ అవుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

MUDA కుంభకోణంలో, సీఎం సిద్ధరామయ్య ఆయన సతీమణి బీఎం పార్వతి ప్రధాన నిందితురాలిగా ఉన్నారు. మైసూరు నగరంలో అక్రమంగా భూములు సేకరించారన్న ఆరోపణలు సిద్ధరామయ్యపై ఉన్నాయి. గత నెల రోజులుగా ఈ కుంభకోణం కర్ణాటక రాజకీయాలను తెగిస్తోందనే వార్తలు వస్తున్నాయి. ఇటీవల, సామాజిక కార్యకర్త మరియు న్యాయవాది టీజే అబ్రహం, బీఎం పార్వతికి కేటాయించిన భూమి వ్యవహారంలో సిద్ధరామయ్యపై విచారణ జరపడానికి గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో, గవర్నర్ గెహ్లాట్‌ సిద్ధరామయ్యపై విచారణకు అనుమతి ఇచ్చారు. మొదటగా, గవర్నర్ తనపై విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరిస్తారు అని సిద్ధరామయ్య భావించారు. అయితే, గవర్నర్ తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర చర్చలకు దారితీసింది.

Read Also : Hydra Demolitions: దడ పుట్టిస్తున్న హైడ్రా.. కొనసాగుతున్న ఆక్రమణల కూల్చివేతలు