Karnataka 2023 : ముస్లిం రిజ‌ర్వేష‌న్ల దుమారం

మ‌త ప్రాతిప‌దిక రిజ‌ర్వేష‌న్ (Karnataka 2023)  బీజేపీ వ్య‌తిరేకిస్తోంది. 4శాతం ముస్లిం రిజ‌ర్వేష‌న్ ను ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది

  • Written By:
  • Updated On - April 26, 2023 / 04:29 PM IST

మ‌త ప్రాతిప‌దిక రిజ‌ర్వేష‌న్ (Karnataka 2023)  బీజేపీ వ్య‌తిరేకిస్తోంది. ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క రాష్ట్రంలో(Muslim Reservation) ఉన్న 4శాతం ముస్లిం రిజ‌ర్వేష‌న్ ను ర‌ద్దు చేస్తూ ఆ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణ‌యం తీసుకుంది. దానిపై స‌వాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు అంజుమన్-ఈ-ఇస్లాం, గులాం రసూల్ అనే ముస్లిం సంస్థ వెళ్లింది. ఆ సంస్థ వేసిన పిటిష‌న్ ను సుప్రీం కోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించింది. ముస్లింల‌కు ఉన్న 4శాతం రిజ‌ర్వేష‌న్ ను ఒక్క లింగ‌, లింగాయత్ ల‌కు చెరో రెండుశాతం పంచాల‌ని బీజేపీ క‌ర్ణాట‌క విభాగం ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప్ర‌క‌ట‌న చేసింది. మ‌రో వైపు అధికారంలోకి వ‌స్తే తెలంగాణ‌లోనూ ముస్లిం రిజ‌ర్వేష‌న్ ర‌ద్దు చేస్తామ‌ని కేంద్ర హోంశాఖ మంత్రి. అమిత్ షా ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే.

క‌ర్ణాట‌క లో ముస్లిం రిజ‌ర్వేష‌న్ ను ర‌ద్దు (Karnataka 2023) 

ఎన్నిక‌ల వేళ రిజ‌ర్వేష‌న్ అంశాన్ని (Muslim Reservation)ఎవ‌రికి వారే ఓటు బ్యాంక్ గా మార్చుకోవ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇటీవ‌ల ద‌ళిత క్రిస్ట‌య‌న్ల‌ను ఎస్సీలుగా గుర్తిస్తూ ఏపీ ప్ర‌భుత్వం తీర్మానం చేసింది. వాళ్ల ఓట్ల కోసం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ ఆ నిర్ణ‌యం తీసుకుంద‌ని బీజేపీ ఏపీ విభాగం మండిప‌డింది. మ‌త ప్రాతిప‌దిక రిజ‌ర్వేష‌న్ల‌ను జాతీయ స్థాయిలో వ్య‌తిరేకిస్తోన్న బీజేపీ వాల‌కాన్ని ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శిస్తున్నారు. క‌ర్ణాట‌క రాష్ట్రంలో(Karnataka 2023) అమ‌లవుతోన్న 4శాతం రిజ‌ర్వేష‌న్ ర‌ద్దుపై సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగా మిగిలిన రాష్ట్రాల్లోని రిజ‌ర్వేష‌న్ అంశం ఆధార‌ప‌డి ఉంది. అందుకే, సుప్రీం కోర్టు వైపు అంద‌రూ ఆస‌క్తిగా చూస్తున్నారు.

ద‌ళిత క్రిస్ట‌య‌న్ల‌ను ఎస్సీలుగా గుర్తిస్తూ ఏపీ ప్ర‌భుత్వం తీర్మానం(Karnataka 2023) 

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 16 లోని సామాజిక న్యాయం, లౌకికవాద సూత్రాల ప్ర‌కారం మ‌త ప్రాతిప‌దిక‌న రిజ‌ర్వేష‌న్లు ఇవ్వ‌కూడ‌ద‌ని. కర్ణాటక ప్రభుత్వం (Karnataka 2023)సుప్రీంకోర్టుకు మంగ‌ళ‌వారం తెలిపింది. ఓబీసీ కేటగిరీ నుంచి ముస్లింలను తొలగిస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వాద‌న‌లు జ‌రిగాయి. దశాబ్దాల నుంచి ముస్లింలకు కేటాయించిన నాలుగు శాతం కోటాను వొక్కలిగ మరియు లింగాయత్ వర్గాల మధ్య సమానంగా పంచాలని విజ్ఞప్తి చేస్తూ అఫిడవిట్‌ను క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం సమర్పించింది. `వెనుకబడిన తరగతులను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ‘కొన్ని కులాల సమాహారం’గా పేర్కొన్నారు. సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతులు, నిరాశ్రయులైన, వివక్షకు గురైన వాళ్లకు రిజ‌ర్వేష‌న్లు ఇవ్వాల‌న్న‌దే రాజ్యాంగంలోని పాయింట్. అదే మతంతో(Muslim Reservation) సమానం కాదు, ”అని అఫిడవిట్ వేసింది.

2002 రిజర్వేషన్ ఆర్డర్‌లోని గ్రూప్ Iలో వెనుకబడిన ముస్లిం వర్గాల

సామాజిక , ఆర్థిక వెనుకబాటును పరిష్కరించడానికి 2002 రిజర్వేషన్ ఆర్డర్‌లోని గ్రూప్ Iలో వెనుకబడిన ముస్లిం వర్గాలను ఎంపికకు అనుమతించామని కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. “ఒక రాష్ట్రంలో రిజర్వేషన్ల మంజూరు మరియు దాని పునర్విభజన అనేది పూర్తిగా వాస్తవ పరిస్థితులపై ఆధారపడిన కార్యనిర్వాహక విధి. ఏ వర్గాన్ని వెనుకబడిన తరగతిగా పరిగణించాలి మరియు వారికి ఎలాంటి ప్రయోజనాలు అందుబాటులో ఉండాలనేది ప్రతి రాష్ట్రం రాజ్యాంగ కర్తవ్యం, ”అని అఫిడవిట్‌లో తెలిపారు. ముస్లింలను వెనుకబడిన కులాలుగా చేర్చాలని కమీషన్లు సిఫారసు చేసినప్పటికీ చట్టం ప్రకారం నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని రాష్ట్రం వాదించింది.

మత ప్రాతిపదికన రిజర్వేషన్లు జరగకూడదని(Muslim Reservation)

ముస్లింలకు నాలుగు శాతం(Muslim Reservation) కోటాను రద్దు చేస్తూ కర్నాటకలో (Karnataka 2023) బిజెపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం సమర్థించారు. పార్టీ మత ఆధారిత రిజర్వేషన్‌లను పార్టీ ఎప్పుడూ నమ్మదని అన్నారు.“ముస్లింలకు మత ఆధారిత రిజర్వేషన్లు నాలుగు శాతం ఉన్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాల జోలికి పోకుండా బీజేపీ ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్‌ను రద్దు చేసింది’’ అని జిల్లాలోని తేర్దాల్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన అన్నారు.మత ప్రాతిపదికన రిజర్వేషన్లు జరగకూడదని మేము నమ్ముతున్నాము, ”అని షా అభిప్రాయపడ్డారు.ముస్లిం రిజర్వేషన్‌ను రద్దు చేసిన తర్వాత బిజెపి ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వొక్కలిగలు మరియు లింగాయత్‌లకు రిజర్వేషన్లను పెంచిందని మంత్రి తెలిపారు.

Also Read : Karnataka Politics: కన్నడ నాట ఏ అంశం ఎవరికి కలిసొచ్చేనో ?

క‌ర్ణాట‌క త‌ర‌హాలో మిగిలిన రాష్ట్రాల్లోనూ మ‌త ప్రాతిప‌దిక‌న రిజ‌ర్వేష‌న్లు ఇవ్వ‌డాన్ని బీజేపీ వ్య‌తిరేకిస్తోంది. ప‌లు రాష్ట్రాల్లోని మేనిఫెస్టోల్లోనూ పొందుప‌రిచారు. అంతేకాదు, 80 శాతం-20శాతం మ‌ధ్య పోటీగా ఎన్నిక‌ల‌ను ఆ పార్టీ అభివ‌ర్ణిస్తోంది. అంటే 80శాతం హిందువులు ఉండే భార‌త దేశంలో 20శాతం ఉండే ముస్లింల‌కు రాజ్యాధికారం ఉంటుందా? అనే రీతిలో బీజేపీ ప్ర‌చారం చేస్తోంది. హిందూ ఓట్ల స‌మీక‌ర‌ణ దిశ‌గా బీజేపీ ముస్లిం రిజ‌ర్వేష‌న్ల‌ను రద్దు చేసింద‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీలు చెబుతున్నాయి. మొత్తం మీద రాజ‌కీయ దుమారం రేపుతోన్న ముస్లిం రిజ‌ర్వేష‌న్ల(Muslim Reservation) అంశం సుప్రీం కోర్టుకు వెళ్లింది. అక్క‌డ ఇచ్చే తీర్పు ఆధారంగా దేశ వ్యాప్తంగా రిజ‌ర్వేష‌న్ల అమ‌లు మార‌నుంది.

Also Read : Karnataka Polls: కర్ణాటక రిజల్ట్ పై రాహుల్ భవిష్యత్తు?