Karnataka 2023 : క‌ర్ణాట‌క కాంగ్రెస్ లో చీలిక‌? కొత్త CBI బాస్ ఎఫెక్ట్!

క‌ర్ణాట‌క కాంగ్రెస్ అడుగులు చీలిక దిశ‌గా(Karnataka 2023) ప‌డుతున్నాయి. సీఎం అభ్య‌ర్థి ఎంపిక విష‌యంలో కాంగ్రెస్ అధిష్టానం త‌డ‌బ‌డుతోంది.

  • Written By:
  • Publish Date - May 15, 2023 / 01:44 PM IST

క‌ర్ణాట‌క కాంగ్రెస్ అడుగులు చీలిక దిశ‌గా(Karnataka 2023) ప‌డుతున్నాయి. ఎన్నిక‌ల ఫలితాలు సానుకూలంగా వ‌చ్చిన‌ప్ప‌టికీ సీఎం అభ్య‌ర్థి ఎంపిక విష‌యంలో కాంగ్రెస్ అధిష్టానం త‌డ‌బ‌డుతోంది. ప్ర‌ధానంగా మాజీ సీఎం సిద్ధి రామ‌య్య‌, పీసీసీ చీఫ్ డీకే శివ‌కుమార్(DK Sivakumar) మ‌ధ్య పోటీ నెల‌కొంది. చెరిస‌గం ప‌ద్ధ‌తిన సీఎం అభ్య‌ర్థిత్వం ఉంటుంద‌ని తొలుత ప్ర‌చారం జ‌రిగింది. కానీ, ఐదేళ్లు సీఎం ప‌ద‌వి కావాల‌ని సిద్ధి రామ‌య్య(Siddi Ramaiah) వ‌ర్గం ప‌ట్టుబ‌డుతోంద‌ని తెలుస్తోంది. ఫ‌లితంగా ఇద్ద‌ర్నీ ఢిల్లీకి ఏఐసీసీ ఆహ్వానించింది.

క‌ర్ణాట‌క కాంగ్రెస్ అడుగులు చీలిక దిశ‌గా(Karnataka 2023)

ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిత్వాన్ని ప్ర‌క‌టించ‌డానికి (Karnataka 2023) ప‌రిశీల‌కునిగా సీనియ‌ర్ల లీడ‌ర్ ర‌ణ‌దీప్ సూర్జిత్ వాలాను అధిష్టానం నియ‌మించింది. ఆయ‌న ఆదివారం రిపోర్ట్ ఇచ్చిన దాని ప్ర‌కారం సిద్ధి రామ‌య్యను సీఎల్పీ నేత‌గా ప్ర‌క‌టించాలి. కానీ, బెంగుళూరులోని ఒక ప్రైవేటు హోట‌ల్ లో 135 మంది ఎమ్మెల్యేలు స‌మావేశం అయిన‌ప్ప‌టికీ సీఎం అభ్య‌ర్థి ప్ర‌క‌ట‌న లేకుండా ముగిసింది. కాంగ్రెస్ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal) కూడా ఈ స‌మావేశంలో ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ తుది నిర్ణ‌యం తీసుకోవ‌డానికి సాహ‌సం చేయ‌లేక‌పోయారు. ఎందుకంటే, ఎవ‌ర్ని ఎంపిక చేసిన‌ప్ప‌టికీ సంక్షోభం పార్టీలో వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని సంకేతాలు అందాయ‌ట‌.

సీఎం అభ్య‌ర్థి ప్ర‌క‌ట‌న చీలిక దిశ‌గా

అటు డీకే ఇటు సిద్ది రామ‌య్య ల‌కు బ‌దులుగా ఖ‌ర్గే ను (Karnataka 2023) సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టిస్తార‌ని ఒకానొక సంద‌ర్భంలో న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. కానీ, ప్ర‌స్తుతం ఏఐసీపీ అధ్య‌క్షుని హోదాలో ఉన్న ఆయ‌న ఒక రాష్ట్రానికి సీఎం రావ‌డాన్ని కొంద‌రు త్రోసిబుచ్చారు. దీంతో పోటీ శివ‌కుమార్ లేదా సిద్ధిరామ‌య్య మ‌ధ్య‌నే ఉంద‌ని కేసీ వేణుగోపాల్ వెల్ల‌డించారు. ఆశావ‌హులు మాజీ డిప్యూటీ సీఎం ప‌ర‌మేశ్వ‌ర్ తో స‌హా ప‌లువురి ఉన్న‌ప్ప‌టికీ ఇద్ద‌రి మ‌ధ్య పోటీ ఉంద‌ని కేసీ చెప్ప‌డం గ‌మ‌నార్హం. అంటే, శివ‌కుమార్ లేదా సిద్ధి రామ‌య్య‌ల్లో ఒక‌రు సీఎం కాబోతున్నార‌ని తెలుస్తోంది.

సీబీఐ బాస్ గా ప్ర‌వీణ్ (Karnataka 2023)

అధిష్టానం, ప‌రిశీల‌కులు సీఎం అభ్యర్థిత్వం ప్ర‌క‌ట‌న కోసం క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఆ లోపుగా మీడియా ముందుకొచ్చిన డీకే శివకుమార్ (DK Sivakumar) త‌న‌ను చూసి 130 మంది ఎమ్మెల్యేల‌ను క‌ర్ణాట‌క ప్ర‌జ‌లు గెలిపించార‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. దీంతో సిద్ధూకు సీఎం ప‌ద‌వి ఇస్తే వ్య‌తిరేక స్వ‌రం ఉంటుంద‌ని సంకేతాలు డీకే నుంచి రావ‌డం క‌ర్ణాట‌క‌లో దుమారం రేగుతోంది.అంతేకాదు, సిద్ధి రామ‌య్య (Siddi Ramaiah)త‌న గ్రూప్ ఎమ్మెల్యేల‌తో ర‌హ‌స్యంగా భేటీ అయ్యార‌ని న్యూస్ వైర‌ల్ అవుతోంది. ఫ‌లితంగా ఇద్ద‌రి మ‌ధ్య స‌యోధ్య కుద‌ర్చ‌డానికి కాంగ్రెస్ అధిష్టానం ప్ర‌య‌త్నం చేస్తోంది. ఆ క్ర‌మంలో సిద్ధూ, డీకేను ఢిల్లీకి రావాల‌ని ఆహ్వానించిన‌ట్టు తెలుస్తోంది.

డీకే   అక్ర‌మాస్తుల కేసులు

అసెంబ్లీలో ఏ మాత్రం బ‌లంలేని రాష్ట్రాల్లోనూ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ ఇప్పుడు క‌ర్ణాట‌క కాంగ్రెస్ లో (Karnataka 2023)జరుగుతోన్న ప‌రిణామాల‌ను నిశితంగా ప‌రిశీలిస్తోంది. అటు సిద్ధూ ర‌హ‌స్య స‌మావేశం ఇటు డీకే మీడియాలో చేసిన వ్యాఖ్య‌ల‌ను గ‌మ‌నిస్తోంది. అవ‌కాశం చూసుకుని ఆప‌రేష‌న్ చేసేలా ఢిల్లీ నుంచి అమిత్ షా టీమ్ సిద్ధ‌మైయింద‌ని తెలుస్తోంది. కాంగ్రెస్ లో చీలిక‌లు వ‌స్తే, వెంట‌నే ఒక గ్రూప్ కు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశం ఇవ్వ‌డానికి బీజేపీ సిద్ధంగా ఉందని తెలుస్తోంది. అంతేకాదు, జేడీఎస్ మ‌ద్ధ‌త‌ను కూడా కూడ‌గ‌ట్టే ప్ర‌య‌త్నం మొద‌లు పెట్టింద‌ని క‌షాయ పార్టీలోని వినికిడి. ఆ క్ర‌మంలోనే డీజీపీగా ఉన్న ప్ర‌వీణ్ సూద్ ను(Praveen) సీబీఐ బాస్ గా నియ‌మించిన‌ట్టు ఢిల్లీ రాజ‌కీయ స‌ర్కిల్స్ లోని టాక్‌.

Also Read : Karnataka CM: ఢిల్లీకి సిద్దరామయ్య.. డీకే రూటేటో ??

సీఎం అభ్య‌ర్థిత్వాన్ని ఆశిస్తోన్న డీకే శివ‌కుమార్ (DK Sivakumar) మీద అక్ర‌మాస్తుల కేసులు ఉన్నాయి. ఆయ‌న మీద సీబీఐ విచార‌ణ వేగంగా జ‌రిగే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం ఆయ‌న మీద 19 వ‌ర‌కు వివిధ ర‌కాలు కేసులు ఉన్నాయి. వాటిని త‌వ్వి తీస్తార‌ని ప్ర‌చారం మొద‌లైయింది. మూడేళ్ల పాటు క‌ర్ణాట‌క(Karnataka 2023) డీజీపీగా ప‌నిచేసిన ప్ర‌వీణ్ సూద్ , డీకే శివ‌కుమార్ మ‌ధ్య పొస‌గ‌దు. అందుకే, సీబీఐ బాస్ గా ప్ర‌వీణ్ ను బీజేపీ నియ‌మించిందని టాక్‌. అంతేకాదు, ఎన్నిక‌ల ప్ర‌చారం స‌మ‌యంలో ఒక ప్రైవేటు హోట‌ల్ లో ఒకే రోజు అమిత్, శివ‌కుమార్ ఉన్నారు. ఆ రోజు వాళ్లిద్ద‌రి మ‌ధ్య ర‌హ‌స్య భేటీ జ‌రిగింద‌ని కూడా ప్ర‌చారం జ‌రిగింది. అంటే, ఒక వేళ సంకీర్ణం ఏర్ప‌డితే డీకే మీద ఆప‌రేష‌న్ చేయ‌డానికి సిద్ధ‌మైయింద‌ని ఆనాడు వ‌చ్చిన టాక్‌. ఇప్పుడు సిద్ధి రామ‌య్య‌ను (Siddi Ramaiah)సీఎంగా ప్ర‌క‌టిస్తే డీకే వ‌ర్గం విడిపోతుంద‌ని కాంగ్రెస్ అధిష్టానం అనుమానం. ఒక వేళ డీకే కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో ఉంటే సీబీఐ దూకుడు పెంచుతోంది. ఇలాంటి ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే, క‌ర్ణాట‌క కాంగ్రెస్ లో చీలిక త‌ప్ప‌ద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లోని బ‌ల‌మైన అభిప్రాయం.

Also Read : Karnataka CM: కర్ణాటక సీఎం ఎవరన్న దానిపై ఖర్గే కసరత్తు