కర్ణాటక ఎన్నికలను(Karnataka 2023) విష సర్పం, విష కన్య వ్యాఖ్యల దుమారం రేగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీని(Narendra Modi) విష సర్పంగా పోల్చుతూ ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్య రగులుతోంది. ప్రతిగా సోనియాగాంధీని(Sonia Gandhi) విష కన్యగా పోల్చుతూ బీజేపీ రాజకీయాన్ని వేడెక్కించింది. ఎన్నికల తేదీ సమీపిస్తోన్న సమయంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వస్తోన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన విష సర్పం వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
కర్ణాటక ఎన్నికలను విష సర్పం, విష కన్య(Karnataka 2023)
పాకిస్తాన్ సుఫారీ వ్యాఖ్యలను యూపీ, గుజరాత్ ఎన్నికల్లో సానుకూలంగా ప్రధాని నరేంద్ర మోడీ మార్చేసుకున్నారు. పాకిస్తాన్, చైనా ఏజెంట్ గా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని పలు సందర్భాల్లో ఆరోపణలు చేయడాన్ని విన్నాం. అంతేకాదు, రాహుల్ గాంధీ చైనా, పాకిస్తాన్ కోసం పనిచేస్తున్నారని కూడా బీజేపీ పలుమార్లు ధ్వజమెత్తింది. ఇప్పుడు అదే తరహా ఆరోపణలను కర్ణాటక ఎన్నికల (Karnataka 2023) సందర్భంగా గాంధీ కుటుంబం మీద ఎక్కుపెట్టింది.
పాకిస్తాన్, చైనా ఏజెంట్ గా కాంగ్రెస్ పార్టీ
ఎన్నికల ప్రచారం(Karnataka 2023) సందర్భంగా మల్లిఖార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీ పాలన గురించి ఘాటుగా మాట్లాడారు. దేశాన్ని చీల్చుతోన్న విష సర్పంగా పోల్చారు. మతాలు, కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే కుట్రదారునిగా మోడీని (Narendra Modi) అభివర్ణించారు. ఆ తరువాత విష సర్పం వ్యాఖ్యలను ఎందుకు చేయాల్సి వచ్చిందో పలు ట్వీట్ల ద్వారా ఖర్గే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒక వేళ ఎవరినైనా ఆ వ్యాఖ్యల బాధపెట్టి ఉంటే వెనక్కు తీసుకుంటానని కూడా ట్వీట్ చేయడం జరిగింది. అయినప్పటికీ బీజేపీ మాత్రం కౌంటర్ ఇస్తూ దూకుడు పెంచింది.
కుట్రదారునిగా మోడీని
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) విషకన్య అంటూ బీజేపీ నేత బసనగౌడ్ కౌంటర్ అటాక్ కు దిగారు. వీసాలు నిరాకరించిన అమెరికాలాంటి దేశాలు కూడా మోడీని కొనియాడుతోన్న విషయాన్ని ఆయన గుర్తు చేశాఉఉ.ప్రపంచ నేతలు మోదీకి రెడ్ కార్పెట్ పరుస్తున్నారని, అలాంటి ప్రధానిపై కాంగ్రెస్ ఇష్టారీతిన మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. వాస్తవానికి ఈ దేశాన్ని సోనియా నాశనం చేశారని, ఆమె విషపూరితమైన వ్యక్తి అని విమర్శించారు.
దహీ, కర్డ్ వ్యవహారాన్ని రగిల్చిన కాంగ్రెస్ (Karnataka 2023)
బసనగౌడ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రణ్ దీప్ సుర్జేవాలా తీవ్రంగా స్పందించారు. కర్ణాటక బీజేపీ నేతలు మెంటల్ బ్యాలెన్స్ కోల్పోతున్నారని విమర్శించారు. రాజకీయంగా కూడా వారు పరపతిని కోల్పోతున్నారని విమర్శలకు దిగారు. మొన్నటి దహీ, కర్డ్ వ్యవహారాన్ని రగిల్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు విష సర్పం అంటూ మోడీని(Narendera Modi) వ్యాఖ్యానించడం దుమారం రేపుతోంది. అమూల్ వర్సెస్ ముస్లిం రిజర్వేషన్ల అంశం ఎన్నికల్లో ప్రధాన అంశాలు ఉంటాయని చాలా మంది భావించారు. కానీ, ఇప్పుడు విష సర్పం, విష కన్య వ్యాఖ్యలు ఇరు పార్టీల మధ్య(Karnataka 2023) వేడి రగిల్చాయి.
Also Read : Karnataka polls: కన్నడ పాలిటిక్స్… అర్బన్ ఓటర్లు ఈ సారి ఎటువైపు..?
కర్ణాటక ఎన్నికల్లో (Karnataka 2023) వరుసగా ఆరు రోజుల పాటు నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఆ సందర్భంగా 22 చోట్ల జరిగే ర్యాలీల్లో ఆయన పాల్గొంటారు. సభల్లోనూ ప్రసంగిస్తారు. అందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తోన్న బీజేపీ మీద కాంగ్రెస్ పార్టీ దూకుడుగా విమర్శలు చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీని విష సర్పం కింద పోల్చడాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోంది. ప్రతిగా సోనియాను విషకన్యగా పోల్చడం వరకు పరిమితం అవుతుందా? లేక ఇతరత్రా రగడ జరగనుందా? అనేది కర్ణాటక ఎన్నికల్లోని ఆసక్తికర అంశం.
Also Read : Karnataka 2023: కన్నడ ఎన్నికల్లో అమూల్, ముస్లిం రిజర్వేషన్ల వేడి