Site icon HashtagU Telugu

Kris Gopalakrishnan : ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు క్రిస్‌ గోపాలకృష్ణన్‌‌పై ఎస్సీ, ఎస్టీ కేసు.. ఎందుకు ?

Infosys Co Founder Kris Gopalakrishnan Sc St Atrocities Act Bovi Community

Kris Gopalakrishnan : సేనాపతి క్రిస్‌ గోపాలకృష్ణన్‌ .. ఈయన ప్రఖ్యాత ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌‌కు సహ వ్యవస్థాపకుడు. క్రిస్‌ గోపాలకృష్ణన్‌‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. గతంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (IISc)లో ఫ్యాకల్టీగా పనిచేసిన దుర్గప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. దుర్గప్ప  బోవి వర్గానికి చెందినవారు. 2014లో క్రిస్‌ గోపాలకృష్ణన్‌‌(Kris Gopalakrishnan), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ మాజీ డైరెక్టర్‌ బలరాంతో పాటు మరో 16 మంది కలిసి తనను ఒక హనీ ట్రాప్ కేసులో ఇరికించారని పోలీసులకు దుర్గప్ప తెలిపారు. ఈక్రమంలో వారు తనపై కులపరమైన దూషణలు చేశారని, బెదిరింపులను పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా 71వ సిటీ సివిల్‌ అండ్‌ సెషన్‌ కోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు బెంగళూరులోని సదాశివనగర్‌ పోలీసులు మొత్తం 18 మందిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. ప్రస్తుతం ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్సీ) ట్రస్టీల మండలిలో సభ్యుడిగా ఉన్న గోపాలకృష్ణన్ ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.

Also Read :Telangana Railway Projects: 9 జిల్లా కేంద్రాలకు రైల్వే రూట్లు దక్కేనా ? మేడారం, రామప్పలకు రైలు చేరేదెప్పుడు ?

నారాయణమూర్తి కంటే రిచ్

ఇన్ఫోసిస్ అధిపతి ఎన్ఆర్ నారాయణమూర్తి, ఈ కంపెనీ సహ వ్యవస్థాపకుడు క్రిస్‌ గోపాలకృష్ణన్‌‌‌లలో ఎవరు రిచ్ ? అంటే చాలామంది నారాయణమూర్తి పేరే చెబుతుంటారు. వాస్తవానికి  సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్ అత్యంత ధనవంతులు. ఈమేరకు వివరాలతో ‘హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2024’ విడుదలైంది.  దీని ప్రకారం గోపాలకృష్ణన్ ఆస్తి విలువ దాదాపు రూ.38,500 కోట్లు. నారాయణ మూర్తి ఆస్తి విలువ దాదాపు రూ.36,600 కోట్లు. గోపాలకృష్ణన్ ఐఐటీ మద్రాసులో ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు.

Also Read :Velupillai Prabhakaran : త్వరలోనే జనం ముందుకు ఎల్టీటీఈ ప్రభాకరన్‌.. నిజమేనా ?

గోపాలకృష్ణన్‌‌కు పద్మభూషణ్‌ 

సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్ 2007 నుంచి 2011 వరకు ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీగానూ సేవలు అందించారు. 2011 నుంచి 2014 వరకు వైస్ ఛైర్మన్‌గా కొనసాగారు. 2014లో ఆయన పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం యాక్సిలర్ వెంచర్స్ అనే కంపెనీకి ఛైర్మన్‌గా క్రిస్ గోపాలకృష్ణన్ వ్యవహరిస్తున్నారు. గోపాలకృష్ణన్‌ను భారత ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది. క్రిస్ గోపాలకృష్ణన్‌ తన భార్య సుధా గోపాలకృష్ణన్ పేరిట ఐఐటీ మద్రాసులో బ్రెయిన్ రీసెర్చ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.