మతమార్పిడి నిరోధక బిల్లు మంగళవారం నాడు కర్ణాటక ప్రభుత్వ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆందోళన మధ్య ఈ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మత స్వేచ్ఛ హక్కు బిల్లు, 2021కి కర్ణాటక క్యాబినెట్ డిసెంబర్ 20 సోమవారం నాడు ఆమోదం తెలిపింది .అనంతరం అసెంబ్లీ ముందకు వచ్చింది. బలవంతపు మతమార్పిడిలను నిషేధించేందుకు ఈ బిల్లును ప్రభుత్వం తీసుకొచ్చింది.అయితే ఈ బిల్లుపై ప్రతిపక్షాలు, కార్యకర్తలు, పౌరులు మరియు న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
Omicron Warning: ఓమిక్రాన్ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు
ఈ బిల్లుని ఒకసారి పరిశీలిస్తే, ఈ చట్టం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో ప్రవేశపెట్టిన వాటి కంటే మరింత కఠినమైంది మతమార్పిడిలకు పాల్పడితే కర్ణాటకలో కనీస శిక్ష మూడు నుండి ఐదు సంవత్సరాలతో పాటు… కనిష్టంగా రూ. 25,000 జరిమానా విధించబడుతుంది. ఉత్తరప్రదేశ్‌లో కనీసం ఒక సంవత్సరం జైలు శిక్ష, రూ. 15,000 జరిమానా మాత్రమే విధించనున్నారు. వివాహం ద్వారా కానీ వివాహం తర్వాత మత మార్పిడిని నిషేధించడంతో పాటు, కొత్త బిల్లు ‘వివాహ వాగ్దానం’ ద్వారా మత మార్పిడిని కూడా నిషేధిస్తుంది.
BJP Vs TRS : గులాబీ, కమలం..’మతం’
కర్నాటక మతస్వేచ్ఛ హక్కు బిల్లులోని సెక్షన్ 3 ప్రకారం ఎవరైనా “ప్రత్యక్షంగా లేదా ఇతరత్రా ఎవరైనా ఒక మతం నుండి మరొక వ్యక్తిని మతం మారడం లేదా మార్చడానికి ప్రయత్నించడం ద్వారా జరిమానా విధిస్తుంది. బలవంతం, మోసపూరిత మార్గాల ద్వారా లేదా వివాహ వాగ్దానం లాంటి వాటి ద్వారా మతమార్పిడులకు సహకరించే కుట్ర చేసిన వారికి కూడా జరిమానా విధించబడుతుందని బిల్లు పేర్కొంది. ఇది బిజెపి పాలిత రాష్ట్రాల్లోని ఇలాంటి ఇతర చట్టాలకు భిన్నంగా ఉంది.