Bengaluru Water Crisis : నీరు వృథా చేస్తే రూ.5 వేలు ఫైన్ కట్టాల్సిందే..

  • Written By:
  • Publish Date - March 9, 2024 / 08:34 PM IST

బెంగళూరు (Bengaluru ) ఈ పేరు వినగానే మోస్ట్ డెవలప్‌డ్ సిటీ అని ఎవరైనా చెపుతారు. భారతదేశ సిలికాన్ వ్యాలీ అని కూడా బెంగళూరుకు పేరు. ఇదే కాదు ట్రాఫిక్‌లో కూడా టాప్‌లో ఉంటుంది. అలాంటి టాప్ సిటీ ఇప్పుడు నీటి కోసం( Water Crisis) తహతహలాడుతుంది. వేసవి కాలం (Summer Season
) పూర్తిగా రాకముందే అక్కడ తాగేందుకు నీరు దొరక్క నగరవాసులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పరిస్థితులు దారుణంగా ఉండగా.. రానున్న రోజులు ఇంకెంత ఘోరంగా ఉంటాయో అని నగర వాసులు భయపడుతున్నారు. స్కూళ్లలో విద్యార్థులకు తాగడానికి కూడా నీరు దొరకని దుస్థితి ఏర్పడింది. నీటి కొరత వల్ల పాఠశాలలను మూసివేసే పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని పాఠశాలలు ఇప్పటికే ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఒకవైపు జలమండలి నుంచి నీటి సరఫరా సగానికి సగం తగ్గిపోవడం, మరోవైపు బోర్లు పని చేయకపోవడంతో ప్రజలు ప్రైవేటు ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. డిమాండ్‌ ఎక్కువవడంతో ట్యాంకర్ల ధరలు అమాంతం పెంచేశారు. ప్రజల అవసరాన్ని బట్టి డబ్బులు వ సూలు చేస్తున్నారు. ఇంతకుముందు 6,000 లీటర్ల ట్యాంకరుకు రూ.600 ధర ఉంటే ఇ ప్పుడు రూ.1,500కు చేరింది. అది కూడా బుక్‌ చేసుకున్న 3-4 రోజులకు సరఫరా అవుతున్నది. వెంటనే సరఫరా చేయాలంటే ఒక్కో ట్యాంకర్‌కు 2,000 సమర్పించుకోవాల్సి వస్తున్నది.

ఇలాంటి ఈ పరిస్థితిలో నగరంలోని ఒక హౌసింగ్ సొసైటీ సంచలన నిర్ణయం తీసుకుంది. హౌసింగ్ సొసైటీలో ఉన్నవారు నీరు అతిగా ఉపయోగించినా, వృథా చేసినా రూ.5వేలు జరిమాన విధిస్తామని స్పష్టం చేసింది. నీటి వృథాను పర్యవేక్షించేందుకు సెక్యూరిటీని నియమించింది. నగరంలోని యలహంక, కనకపుర, వైట్‌ఫీల్ట్‌ ప్రాంతాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. దీంతో నీరు వృథాను కట్టడి చేసేందుకు బెంగళూరులోని ఒక హౌసింగ్‌ సొసైటీ వినూత్న ఆలోచన చేసింది. ఆ హౌసింగ్ సొసైటీలో ఉన్న వారు ఎవరైనా నీటిని అతిగా ఉపయోగించడం, వృథా చేసే వారికి రూ.5 జరిమాన విధిస్తామని తెలిపింది. ఇక ఈ నీటి వృథాను పర్యవేక్షించడానికి స్పెషల్‌గా సెక్యూరిటీని నియమించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు వైట్‌ఫీల్డ్‌ ప్రాంతంలోని పామ్ మిడోస్ హౌసింగ్ సొసైటీ.. ఆ సొసైటీలో నివసించే వారికి నోటీసులు జారీ చేసింది.

Read Also : YCP vs TDP : జగన్ సిద్దం మీటింగ్ కి గ్రీన్ మ్యాట్ గ్రాఫిక్స్..?