Site icon HashtagU Telugu

Kerala : రైలు ఢీకొని నలుగురు రైల్వే కూలీల దుర్మరణం

Kerala Express Accident

Kerala Express Accident

గత కొద్దీ రోజులుగా వరుస రైలు ప్రమాదాలు (Train Accident) ప్రయాణికులను కలవరపెడుతున్నాయి. రైలు ప్రయాణం అంటేనే భయపడిపోతున్నారు. ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో ..? ఏ రైలు వచ్చి ఢీ కొడుతుందో..? ఎప్పుడు ఏ భోగిలో పొగలు వస్తాయో..? ఇలా అనేక అనుమానాలు ప్రయాణికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ ఆందోళనలకు మరింత ఆద్యం పోస్తూ వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

తాజాగా కేరళలో(Kerala) ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు రైల్వే కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన షోరనూర్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. కూలీలు భరతపుళ నదిపై ఉన్న రైల్వే బ్రిడ్జి మీద పారిశుద్ధ్య పనులు (sanitary workers) చేస్తుండగా, అకస్మాత్తుగా కేరళ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురి మృతదేహాలు గుర్తించగా, మరొకరు నదిలో పడిపోయినట్లు అనుమానిస్తున్నారు. అధికారులు ప్రాణాపాయంలో ఉన్నవారి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. మృతులంతా తమిళనాడుకు చెందిన వారు అని సమాచారం. రైల్వే అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రైల్వే యాజమాన్యాన్ని కోరుతున్నారు.

Read Also : YS Sharmila : చంద్రబాబుకు హెచ్చరిక జారీ చేసిన వైస్ షర్మిల..