Site icon HashtagU Telugu

Govt OTT : ఓటీటీ యాప్ తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం

Govt Ott

Govt Ott

Govt OTT : ఇప్పుడు ‘ఓవర్ ది టాప్’ (ఓటీటీ)ల వినియోగం బాగానే పెరిగింది. చాలామంది కొత్తగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్ తీసుకుంటున్నారు. ఓటీటీ యాప్‌లలో సినిమాలు, టాక్ షోలు, సీరియళ్లు, పాత మూవీలు చూసి ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు. దీనివల్ల ప్రముఖ ఓటీటీ యాప్‌లు బాగానే లాభాలను గడిస్తున్నాయి. ఓటీటీ మార్కెట్‌కు ఉన్న ఈ క్రేజ్‌ను సొమ్ము చేసుకునేందుకు ప్రభుత్వ రంగ సంస్థలు కూడా రెడీ అవుతున్నాయి. ఈక్రమంలోనే కేరళ ప్రభుత్వం ‘సీస్పేస్‌’ (CSpace) పేరుతో ఓటీటీ సర్వీస్‌లను ప్రారంభించింది. కేరళ సీఎం పినరయి విజయన్‌ గురువారం సీస్పేస్‌ ఓటీటీ ప్లాట్‌పామ్‌ను ప్రారంభించారు. ఇది దేశంలోనే తొలి ప్రభుత్వ రంగ ఓటీటీ వేదిక. ఓ వైపు లాటరీ వ్యాపారం.. మరో వైపు ఓటీటీ వ్యాపారం కూడా చేస్తూ కేరళ రాష్ట్రం దేశంలోనే స్పెషల్‌గా నిలుస్తోంది. వామపక్షాలు అధికారంలో ఉన్నా.. ఆ రాష్ట్ర పాలనలో అధునాతన సంస్కరణలు అమల్లో ఉండటం విశేషం.

We’re now on WhatsApp. Click to Join

Also Read :Vande Bharat – AP : 12 నుంచి ఏపీకి మరో ‘వందేభారత్’.. హాల్టింగ్ స్టేషన్లు ఇవీ

‘12th ఫెయిల్’ .. తప్పక చూడండి

‘12th ఫెయిల్..’ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. సామాన్యులే కాదు ఏకంగా సెలబ్రిటీలు కూడా ఈ సినిమాపై భారీ ప్రశంసలు కురిపించారు. ఇప్పుడీ చిత్రం తెలుగు వెర్షన్​సడెన్​గా ఓటీటీ స్ట్రీమింగ్​కు రెడీ అయిపోయింది. ఎక్కడ, ఎప్పుడు నుంచి స్ట్రీమింగ్​అవుతుందో స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ తమ లైఫ్​లో తప్పకుండా చూడాల్సిన కొన్ని చిత్రాలు ఉంటాయి. అలాంటి వాటి కిందకే ఈ 12th ఫెయిల్‌ వస్తుంది. ఎందుకంటే మనిషి వికాసానికి చదువు ఎంతో ముఖ్యం. దాని ప్రాముఖ్యతను తెలియజేస్తూ.. అలాగే మారుమూల ప్రాంతంలోని ఓ పేద కుటుంబం నుంచి వచ్చి, ఓ దశలో 12వ తరగతిలో ఫెయిల్ అయినా, అన్ని కష్టాలను దాటుకొని ఓ సామాన్యుడు ఐపీఎస్ అధికారి ఎలా అయ్యాడని సినిమాలో అద్భుతంగా చూపించారు.గతేడాది ఏ మాత్రం అంచనాలు లేకుండా అతి తక్కువ లో బడ్జెట్​తో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద క్రమక్రమంగా హైప్ పెంచుతూ సూపర్ డూపర్ హిట్ అయింది. మనోజ్ కుమార్ శర్మ అనే ఐపీఎస్ ఆఫీస‌ర్ జీవితం ఆధారంగా దీన్ని రూపొందించారు.

Exit mobile version