Site icon HashtagU Telugu

13 Killed : క్రాకర్ షాప్‌ అగ్నిప్రమాద ఘ‌ట‌న‌లో 13కి చేరిన మృతుల సంఖ్య‌.. మృతుల కుటుంబాల‌కు 5ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా

Crackers

Crackers

బెంగళూరు శివార్లలోని బాణాసంచా దుకాణం-కమ్-గోడౌన్‌లో శనివారం జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 13కి చేరింది. ఘ‌ట‌న స‌మ‌యంలో ఆరుగురు స‌జీవ‌ద‌హ‌న‌మైన‌ట్లు పోలీసులు తెలుప‌గా.. రెస్క్యూ ఆప‌రేష‌న్ త‌రువాత ఆ సంఖ్య 13కి చేరింది. అనేకల్ తాలూకాలోని అత్తిబెలె వద్ద ఉన్న దుకాణంలో మంటలు చెలరేగకముందే పద్నాలుగు మంది వ్యక్తులు ఘ‌ట‌న నుంచి బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు అత్యవసర సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పారు.
మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మృతుల‌కు సంతాపం తెలిపారు. ఆనేకల్ క్రాకర్ షాపులో జరిగిన దుర్ఘటనలో 13 మంది కూలీలు సజీవ దహనమైన విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయ‌న కోరారు. మృతుల కుటుంబాలకు ప్ర‌భుత్వం ఎక్స్‌గ్రేషియా అందించాలని ఆయ‌న డిమాండ్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు.. క్రాకర్ షాప్ నవీన్ అనే వ్యక్తికి చెందినదిగా గుర్తించారు. ఘ‌ట‌న‌లో మ‌ర‌ణించిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. బాలాజీ క్రాకర్స్‌ షాపులో క్రాకర్స్‌ దింపుతుండగా అగ్నిప్రమాదం సంభవించిందని బెంగళూరు రూరల్‌ ఎస్పీ మల్లికార్జున బాలదండి తెలిపారు. కొద్దిసేపటికే మంటలు గోడౌన్, స్టాల్‌కు వ్యాపించాయని తెలిపారు. తొలుత ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయని.. యజమాని నవీన్‌కు కూడా కాలిన గాయాలయ్యాయని తెలిపారు. ఈ ఘటనలో కోట్ల విలువైన క్రాకర్లు, ప‌లు వాహ‌నాలు దగ్ధమమైన‌ట్లు పోలీసులు తెలిపారు. మ‌రోవైపు ఈ అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న‌పై సిద్ద‌రామ‌య్య ప్ర‌భుత్వం స్పందించింది. సజీవదహనమైన 13 మంది కుటుంబాలకు కర్ణాటక ప్రభుత్వం శనివారం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది.

Also Read:  Telangana: తెలంగాణలో వందల కోతుల మృతదేహాలు

Exit mobile version