Site icon HashtagU Telugu

Actor Vijay Political Party : పార్టీ రిజిస్ట్రేషన్ పూర్తయింది.. ఎన్నికలకు రెడీ : నటుడు విజయ్

Actor Vijay Political Party Tamil Nadu

Actor Vijay Political Party : ప్రముఖ నటుడు విజయ్ ఆదివారం కీలక ప్రకటన చేశారు.  తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కజగం (టీవీకే)ను కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా రిజిస్టర్ చేసిందని ఆయన వెల్లడించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన పార్టీకి ఈసీ అనుమతులు మంజూరు చేసిందన్నారు. ఈవివరాలను ఎక్స్ వేదికగా ఓ లేఖ ద్వారా విజయ్ తెలిపారు.  ఫిబ్రవరి 2న తాము టీవీకే పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఈసీకి అప్లై చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎట్టకేలకు పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిందన్నారు. ఈవిషయాన్ని అందరికీ చెబుతున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని విజయ్ చెప్పారు.

Also Read :Rahul Gandhi US Tour : అమెరికాకు చేరుకున్న రాహుల్‌గాంధీ.. పర్యటన షెడ్యూల్ ఇదీ

పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ పూర్తయినందున త్వరలోనే రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. దీనికి సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించే వరకు ఓపిగ్గా ఎదురుచూడాలని అభిమానులకు ఆయన సూచించారు.‘‘అడ్డుగోడలను బద్దలు కొట్టండి. మన జెండాను సగర్వంగా ఎత్తి చూపించండి. ఉద్యమ కాగడా చేతిలో పట్టుకొని వచ్చి టీవీకే పార్టీలో చేరండి. తమిళనాడు ప్రజల గుండెచప్పుడులా పనిచేయండి’’ అని విజయ్(Actor Vijay Political Party) పిలుపునిచ్చారు.

2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌కు చెందిన టీవీకే పార్టీ పోటీచేయనుంది. ఈవిషయాన్ని గతంలోనే ఆయన ప్రకటించారు. ఆగస్టు 22న తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఉన్న టీవీకే ఆఫీసులో పార్టీ గుర్తు, జెండా, సాంగ్‌లను విజయ్ విడుదల చేశారు.తమిళనాడు సంక్షేమమే తమ పార్టీ ఏకైక ఎజెండా అని ఆయన అంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు తమ పార్టీ పోరాడుతుందని తెలిపారు. తమిళనాడులోని నటుల మంచి క్రేజ్ ఉంటుంది. చాలామంది నటులు రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు. విజయ్ భవితవ్యం ఎలా ఉంటుందో వేచిచూడాలి.