Site icon HashtagU Telugu

South India : అన్నం వడ్డించడానికి అరటి ఆకును ఎందుకు వాడుతారో తెలుసా?

South India Banana Leaf

South India Banana Leaf

దక్షిణ భారతీయులు (South India) అరటి ఆకులో అన్నం తినడానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకు అలా ? మరెన్నో ఆకులు ఉండగా అరటి ఆకుల్లో తినడానికి ఎందుకు ప్రాధాన్యం ఇస్తారు ? అనేది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

మనకు లాలాజలం రావడానికి దక్షిణ భారత (South India) ఆహార పల్లాన్ని ఒక్కసారి చూస్తే సరిపోతుంది. సౌత్ ఇండియన్ ఫుడ్‌లో కనిపించే ప్రత్యేకమైన సువాసన , రుచుల మిశ్రమం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను ఆకర్షిస్తుంది. ఇక దీనిని సాంప్రదాయ పద్ధతిలో అరటి ఆకులో వడ్డిస్తే.. మరింత రుచికరంగా మారుతుంది.  సద్య అనేది దక్షిణాదిలో ఒక ప్రసిద్ధ వేడుక భోజనం.. దీన్ని ఎల్లప్పుడూ అరటి ఆకుపై వడ్డిస్తారు. థాలీలోని అన్ని రకాల వంటకాలను చూస్తున్నప్పుడు, అరటి ఆకులో ఆహారం ఎందుకు వడ్డిస్తారు అనే ప్రశ్న గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇది ఆరోగ్య కారణాల కోసమా లేదా రుచి కోసమా? వాస్తవానికి ఇది ఆ రెండు అంశాల కోసం అని గ్రహించాలి.

అరటి ఆకుల్లో ఏముంది?

అరటి ఆకులు మందంగా, పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి. కాబట్టి వాటిని ఆహారం అందించడానికి వినియోగంలోకి తీసుకొచ్చారు. అరటి ఆకులలో సహజంగా పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అరటి ఆకులు యాంటీ బాక్టీరియల్‌గా కూడా పనిచేస్తాయి. క్రిములను చంపేస్తాయని చెబుతారు. అరటి ఆకులపై మైనం లాంటి పూత ఉంటుంది.’ జర్నల్ ఆఫ్ ఎత్నిక్ ఫుడ్స్’లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. అరటి ఆకుల వాడకం లోహ పాత్రలు రావడానికి ముందు కాలం నాటిది.

వినియోగంలో ది బెస్ట్:

  1. మనం నిత్యం ఉపయోగించే పాత్రలను కడగడం వల్ల సబ్బు క్లీనర్‌ల నుంచి రసాయన అవశేషాలు వచ్చే ప్రమాదం ఉంది.
  2. కానీ అరటి ఆకులు సహజంగా మైనపు లాంటి పదార్ధంతో పూత పూయబడి ఉంటాయి. ఇది ఆహారాన్ని దాని ఉపరితలంపై అంటుకోకుండా చేస్తుంది.
  3. కాబట్టి, ఆకులను కడగడం సులభం (సాదా నీటితో కడిగితే సరిపోతుంది) . పునర్వినియోగం కోసం మరింత పరిశుభ్రమైనది.
  4. మెటల్ మరియు గ్లాస్ ప్లేట్‌లతో పోలిస్తే ఇది మరింత పొదుపుగా ఉంటుంది.
  5. అరటి ఆకులు ముఖ్యంగా పేపర్ ప్లేట్లు మరియు డిస్పోజబుల్ ప్లాస్టిక్ ప్లేట్‌లతో పోల్చితే మరింత పర్యావరణ అనుకూలమైనవి.

Also Read:  Diabetics : మధుమేహులు పండుగను ఎంజాయ్ చేసేటప్పుడు ఇవి గుర్తు పెట్టుకోండి..!