Electoral Bonds : డీఎంకే కు అత్యధికంగా విరాళాలు ఇచ్చింది ఎవరో తెలుసా..?

ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్.. 2019-20 ఇంకా 2022-23 మధ్య కాలంలో డీఎంకేకు కి ఏకంగా రూ.509 కోట్లు అందించినట్లు జాబితాలో తేలింది

  • Written By:
  • Publish Date - March 18, 2024 / 04:51 PM IST

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్టోరల్ బాండ్ల (Electoral Bond Data) గురించే చర్చ నడుస్తుంది. ఎలక్టోరల్‌ బాండ్లను కొనుగోలు చేసిన వారి పేర్లను బయటపెట్టాలని సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాలు జారీ చేయడం తో ఆ వివరాల జాబితాలను ఒక్కోటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా తమిళనాడులోని డీఎంకే (DMK) పార్టీకి ఎవరెవరి దగ్గర నుంచి ఎంతెంత విరాళాలు వచ్చాయి అనేది బయటకు వచ్చింది. ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (Future Gaming And Hotel Services Private Ltd).. 2019-20 ఇంకా 2022-23 మధ్య కాలంలో డీఎంకేకు కి ఏకంగా రూ.509 కోట్లు అందించినట్లు జాబితాలో తేలింది. ఇది కాక ఈ పార్టీ బాండ్ల ద్వారా 611 కోట్లను అందుకుంది . అయితే అన్నింటి కంటే డీఎంకేకు ఎక్కువగా 79 శాతం విరాళం అందజేసింది ఫ్యూచర్ గేమింగే

We’re now on WhatsApp. Click to Join.

కేవలం ఫ్యూచర్ గేమింగ్ సంస్థ మాత్రమే కాదు డీఎంకే పార్టీకి ఇతర కంపెనీల నుంచి కూడా అధిక మొత్తంలో విరాళాలు అందినట్లు తేలింది. అందులో 2019 నుంచి 2023 మధ్యలో మేఘా ఇన్ఫ్రా నుంచి 105 కో్టలు, ఇండియా సిమెంట్స్ నుంచి 14 కోట్లు, సన్ టీవీ నెట్‌వర్క్‌ నుంచి 10 కోట్లు, త్రివేణి నుంచి 8 కోట్లు, రామ్‌కో సిమెంట్స్ నుంచి 5 కోట్లు ముడుపులు అందాయి. 2019 నుంచి 2023 మధ్యలో నాలుగేళ్ళ కాలంలో డీఎంకే పార్టీకి మొత్తంగా 656.5 కోట్ల విరాళాలు వచ్చాయని ఎలక్టోరల్ బాండ్ తెలిపింది. అలాగే బాండ్ల ద్వారా బీజేపీకి భారీగా లబ్ది చేకూరినట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఆ పార్టీకి రూ.8,718.5 కోట్లు విరాళంగా వచ్చినట్లు డేటాను బట్టి తెలుస్తోంది. ఎన్నికల బాండ్ల పథకం ప్రారంభమైన 2018 మార్చి నుంచి రాజకీయ పార్టీలు నగదుగా మార్చుకున్న వాటి వివరాలను తాజాగా ఈసీ వెబ్‌సైట్‌లో ఉంచింది. ఇందులో గుర్తింపు పొందిన, పొందని 523 రాజకీయ పార్టీల సమాచారం ఉంది.

Read Also : Bandaru Satyanarayana : బండారు సత్యనారాయణ కు వైసీపీ ఎంపీ టికెట్..?