Site icon HashtagU Telugu

Karnataka CM: పార్టీ నిర్ణయం కోర్టు తీర్పుతో సమానం: డీకే

Karnataka CM

Karnataka Cm (2)

Karnataka CM: కర్ణాటక ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ అఖండ విజయం సాధించింది. అధికార పార్టీ బీజేపీపై కాంగ్రెస్ భారీ మెజారిటీని సాధించింది. అయితే అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకునే ప్రక్రియ ఉత్కంఠకు దారి తీసింది. ఐదు రోజులుగా నలుగుతున్న ఈ అంశానికి ఎట్టకేలకు తెర పడింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్యను ఆ పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ని ఎంపిక చేసింది. ఈ తతాంగం అంతా ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో సాగినట్టు తెలుస్తుంది.

కర్ణాటక ముఖ్యమంత్రి రేసులో డీకే పేరు ప్రధానంగా వినిపించింది. అక్కడ ఇంపాక్ట్ లీడర్ గా ముద్ర వేసుకున్న డీకే నే సీఎంగా అనుకున్నారందరు. కానీ సీన్ రివర్స్ అయింది. అయితే డీకే అధిష్ఠానానికి కట్టుబడే తగ్గినట్టు తెలిపారు. సీఎం పదవి వదులుకున్న డీకే తన స్పందన తెలియజేశారు.

డీకే శివకుమార్ ను ఉపముఖ్యమంత్రిగా నియమించడంపై డీకే సానుకూలంగా స్పందించారు. పార్టీ నిర్ణయం కోర్టు తీర్పు లాంటిదని డీకే అన్నారు. సీఎం పదవి విషయంలో పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉన్నానని, పార్టీ ఆశిస్తే ఏ పదవిని అయినా వదులుకుంటానని డీకే అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యక్తిగత ప్రయోజనాలకంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని అభిప్రాయపడ్డారు. సో.. ఈ విషయంలో పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న అంటూ చెప్పుకొచ్చాడు. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డీకే ఈ వ్యాఖ్యలు చేశారు.

Read More: IPL 2023: లెజెండ్స్ తో శుభ్‌మన్ గిల్‌ ని పోల్చిన రాబిన్ ఉతప్ప

Exit mobile version