Delhi Metro: మెట్రో ప్రయాణాలకు స్మార్ట్ కార్డులను ఉపయోగిస్తారు. స్మార్ట్ కార్డులు లేని ప్రయాణికులు స్టేషన్ నుండే టోకెన్లు లేదా క్యూఆర్ టిక్కెట్లు తీసుకుంటారు. ఇప్పటి వరకు ఈ క్యూఆర్ టిక్కెట్ (Delhi Metro) ఒక్కసారి మాత్రమే చెల్లుబాటు అయ్యేది. DMRC MJQRTని ప్రారంభించింది. ఆ తర్వాత ఈ QR టిక్కెట్లను ఒకటి కంటే ఎక్కువసార్లు ఉపయోగించవచ్చు. బహుళ ప్రయాణ QR టిక్కెట్‌ను పొందడానికి మీరు DMRC యాప్‌లో నమోదు చేసుకోవాలి.
ఢిల్లీ మెట్రో మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వికాస్ కుమార్ గురువారం మెట్రో భవన్‌లో ఈ కొత్త ఫీచర్‌ను లాంఛనంగా ప్రారంభించారు. శుక్రవారం నుంచి మెట్రో ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. డిజిటలైజేషన్ ద్వారా కొనసాగుతున్న ‘ఈజ్ ఆఫ్ బుకింగ్’ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఈరోజు మల్టిపుల్ జర్నీ క్యూఆర్ టిక్కెట్లను ప్రారంభించింది. ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని కల్పించేలా దీన్ని రూపొందించారు.
Also Read: AFG vs NZ Test: బంతి పడకుండానే చరిత్ర.. ఒక్క బంతి కూడా పడకుండా రద్దైన టెస్టులివే..!
MJQRT అంటే ఏమిటి?
మెట్రో టిక్కెట్ల కోసం ప్రయాణికులు క్యూలైన్లలో నిల్చోవాల్సి వచ్చింది. దీన్ని నివారించడానికే స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం కార్డులు వినియోగించని వారు క్యూఆర్ టిక్కెట్లను ఉపయోగిస్తున్నారు. అయితే దీని కోసం కూడా పొడవైన క్యూలలో నిలబడాల్సి వస్తోంది. మల్టిపుల్ జర్నీ QR టికెట్ (MJQRT)ని ప్రారంభించడం వలన ఈ మార్గాల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ టిక్కెట్ల ప్రత్యేకత ఏమిటంటే.. వీటిని ఒకటి కంటే ఎక్కువసార్లు ప్రయాణించడానికి ఉపయోగించవచ్చు.
MJQRT ప్రయోజనాలను పొందేందుకు వినియోగదారులు యాప్‌లో నమోదు చేసుకోవాలని DMRC తెలిపింది. ఇందుకు రూ.150 చెల్లిస్తారు. మెట్రో స్మార్ట్ కార్డ్ వలె ప్రయాణీకులు తమ ప్రయాణ అవసరాలకు అనుగుణంగా గరిష్టంగా రూ. 3,000 వరకు MJQRT రీఛార్జ్ చేయవచ్చు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రకారం.. ప్రజలు తమ ప్రయాణానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని (ఛార్జీల చెల్లింపు, రీఛార్జ్‌తో సహా) DMRC మొమెంటం ఢిల్లీ సారథి 2.0’లో చూడగలరు.
రూ.60 బ్యాలెన్స్ కలిగి ఉండటం తప్పనిసరి
DMRC ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూజ్ దయాల్ మాట్లాడుతూ.. MJQRT కోసం ఎటువంటి సెక్యూరిటీ డిపాజిట్ అవసరం లేదు. వినియోగదారులు UPI, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వంటి డిజిటల్ చెల్లింపుల ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఎంజేక్యూఆర్‌టీలో ప్రయాణించాలంటే కనీసం రూ.60 బ్యాలెన్స్ ఉండాలని చెప్పారు. శుక్రవారం నుంచి దీనిని వినియోగించుకోవచ్చు.