Site icon HashtagU Telugu

Sabarimala : శబరిమలలో దర్శన సమయం గంట పెంపు

Sabarimala

Sabarimala

Sabarimala : అయ్యప్పస్వామి  భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమల అయ్యప్ప దర్శన సమయాన్ని గంటసేపు పొడిగించింది. ప్రస్తుతం రోజులో రెండో భాగంలో సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులు అయ్యప్పను దర్శించుకుంటున్నారు. ఇకపై మధ్యాహ్నం 3 గంటల నుంచే దర్శనాలు మొదలై రాత్రి 11 గంటల వరకు కొనసాగుతాయి. రోజూ వర్చువల్‌ క్యూ ద్వారా 90వేల బుకింగ్‌లు, స్పాట్‌లో 30వేల బుకింగ్స్‌ ఉంటున్నాయని ఆలయ ఏర్పాట్లను చూసే ఐజీ స్పర్జన్‌ కుమార్‌ చెప్పారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో దర్శనాలను త్వరత్వరగా సాఫీగా సాగేలా చూడాలన్న ప్రయత్నాలకు ఆటంకం కలుగుతోందన్నారు.కాగా, దర్శన సమయాలను రోజూ 17 గంటలకు మించి పొడిగించడం సాధ్యం కాదని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు  పేర్కొంది. దర్శనం కోసం క్యూలో వేచి ఉండే భక్తులకు మంచినీరు, బిస్కెట్లను అందజేయాలని డిసైడ్ చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

భారీ సంఖ్యలో భక్తులు వస్తుండటంతో దర్శన సమయాలను పొడిగించేందుకు శబరిమల(Sabarimala) తంత్రి అనుమతి ఇచ్చారు. స్వామి వారి దర్శనం కోసం భక్తులకు సగటున 14 గంటల టైం పడుతోంది. అయితే క్యూ కాంప్లెక్స్‌లో తగిన సౌకర్యాలు లేవని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో వర్చువల్ క్యూ బుకింగ్‌ను రోజుకు 90 వేల నుంచి  80 వేలకు తగ్గించాలని అధికారులు నిర్ణయించారు. అయితే ముందుగా నిర్దేశించిన ప్రదేశాలలో స్పాట్ బుకింగ్ కేంద్రాలు యథావిధిగా పనిచేస్తాయని తెలిపారు. రోజుకు 90 వేల మంది యాత్రికుల దర్శించుకోవాలంటే.. ఒక గంటలో 18 పవిత్ర మెట్లను అధిరోహించడానికి 4,600 మంది యాత్రికులను అనుమతించాల్సి ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పవిత్ర మెట్ల ద్వారా గంటకు 3,500 మంది యాత్రికులను మాత్రమే అనుమతిస్తుమన్నామని వెల్లడించారు.

Also Read: Article 370 : కశ్మీర్‌‌ ‘ప్రత్యేక హోదా’ రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు ఇవాళే