Site icon HashtagU Telugu

Congress Suspended : కాంగ్రెస్ యువనేతకు భారీ షాక్..లైంగిక ఆరోపణలే కారణం

Congress Suspends Mla Rahul

Congress Suspends Mla Rahul

కేరళ రాజకీయాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మామ్‌కూటథిల్‌(Rahul Mamkootathil)పై లైంగిక ఆరోపణలు (Allegations) తీవ్ర దుమారం రేపుతున్నాయి. మొదట నటి రిని జార్జ్ తనపై ఆయన మూడు సంవత్సరాలుగా లైంగిక వేధింపులు చేస్తున్నారని బయటపెట్టగా, అసభ్య సందేశాలు, అభ్యంతరకరమైన ఫోటోలు పంపడమే కాకుండా హోటళ్లలో రూములు బుక్ చేసి రావాలని తరచూ ఒత్తిడి చేసేవారని ఆరోపించారు. ఈ విషయంపై పార్టీ సీనియర్ నాయకులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని, పైగా ఆయన్ను పదవులు కట్టబెట్టారని ఆమె వాపోయారు. దీంతో బీజేపీ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టి, రాహుల్‌ను ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది.

HYD – Amaravati : హైదరాబాద్‌-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే- త్వరలోనే మార్గం ఖరారు?

ఆరోపణలు క్రమంగా పెరుగుతుండటంతో రాహుల్ మామ్‌కూటథిల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే ఇదే సమయంలో మరో ఆడియో క్లిప్ వెలుగులోకి రావడంతో వివాదం మరింత ముదిరింది. అందులో ఆయన ఒక మహిళను గర్భస్రావం చేయించుకోవాలని బలవంతం చేయడమే కాకుండా, మాట వినకపోతే ప్రాణాలు తీస్తానని బెదిరించినట్లు రికార్డు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ పరిణామాలన్నింటి కారణంగా కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి పెరిగింది. చివరికి పార్టీ నాయకత్వం ఆయనను ఆరు నెలల పాటు ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది.

ఈ ఘటనపై రాహుల్ మామ్‌కూటథిల్ స్పందిస్తూ తనపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా ఖండించారు. వాట్సాప్ చాట్‌లు, ఫోన్ సంభాషణల ఆడియోలను బయటపెట్టి తన నిర్దోషిత్వాన్ని రుజువు చేయడానికి ప్రయత్నించారు. మహిళను గర్భస్రావం చేయమని బలవంతం చేసిన ఆడియోను ఎవరో కావాలనే తయారు చేశారని ఆరోపించారు. ఇదే సమయంలో ఈ కేసును కేరళ మహిళా కమిషన్, బాలల హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించాయి. రాహుల్ భవిష్యత్తు రాజకీయ పరిస్థితులు ఎలా మలుపు తిరుగుతాయో చూడాలి.