Cm Vijay: తొలి సంతకం ఉచిత విద్యుత్ పై సీఎం విజయ్

తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారు. ఈరోజు ఉదయం పది గంటలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో తాను హామీ ఇచ్చిన విధంగా వివిధ ఫైళ్లపై సంతకాలు చేశారు. తమిళనాడులో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం […]

Published By: HashtagU Telugu Desk
Vijay Takes Sensational Decision

Vijay Takes Sensational Decision

తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారు. ఈరోజు ఉదయం పది గంటలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో తాను హామీ ఇచ్చిన విధంగా వివిధ ఫైళ్లపై సంతకాలు చేశారు.

తమిళనాడులో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం చేశారు. ఆ తర్వాత మహిళా భద్రతపై, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా, ఉచిత బస్సు ప్రయాణం తదితర హామీలకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేశారు. చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తదితరులు హాజరయ్యారు.

  Last Updated: 10 May 2026, 11:29 AM IST