Site icon HashtagU Telugu

Child Pornography Case : చైల్డ్ పోర్నోగ్రఫీ కేసులో 12 మందిని అరెస్ట్ చేసిన కేర‌ళ పోలీసులు

child pornography case

child pornography case

చైల్డ్ పోర్నోగ్రఫీపై అణిచివేతలో భాగంగా కేర‌ళ పోలీసులు ప్ర‌త్యేక నిఘా పెట్టారు. పిల్లలకు సంబంధించిన అభ్యంతరకరమైన విషయాలను వీక్షించినందుకు, షేర్ చేసినందుకు కేర‌ళ పోలీసులు 12 మందిని అరెస్ట్ చేశారు. వీరి వ‌ద్ద నుంచి 270 ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 12 మందిని అరెస్ట్ చేసి 142 కేసులు నమోదు చేశారు. అరెస్టయిన వారిలో వృత్తిపరమైన ఉద్యోగాలు చేస్తున్న యువకులు, సాంకేతిక నిపుణులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.

పి-హంట్ 23.1 పేరుతో కేరళ పోలీసు సిసిఎస్‌ఇ (చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లోయిటేషన్‌ను ఎదుర్కోవడం) బృందం పదో స్పెషల్ డ్రైవ్ కింద రాష్ట్రవ్యాప్తంగా సుమారు 858 లొకేషన్‌లను గుర్తించింది. జిల్లా ఎస్పీల కార్యాచరణ పర్యవేక్షణలో రాష్ట్రవ్యాప్తంగా 26 ఫిబ్రవరి 2023 ఆదివారం తెల్లవారుజాము నుండి ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడులు విజ‌య‌వంత‌మైన‌ట్లు పోలీసులు తెలిపారు. ఆపరేషన్‌లో భాగంగా బృందాలు 270 పరికరాలను స్వాధీనం చేసుకున్నాయి. 142 కేసులు నమోదయ్యాయి. వీటిలో మొబైల్ ఫోన్లు, మోడెమ్‌లు, హార్డ్ డిస్క్‌లు, మెమరీ కార్డ్‌లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

అరెస్టయిన వారిలో కొందరు తమ డివైజ్‌లలో ఈ మేరకు అనేక చాటింగ్‌లు ఉన్నందున పిల్లల అక్రమ రవాణాలో కూడా ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ చిత్రాలు, వీడియోలను ప్రచారంలో ఉంచిన మిగతా వ్యక్తుల వివరాలను మరింత సేకరిస్తున్నారు. చట్టం ప్రకారం, ఏదైనా పిల్లల అశ్లీల కంటెంట్‌ను వీక్షించడం, పంపిణీ చేయడం లేదా నిల్వ చేయడం చట్టరీత్యా నేర‌మ‌ని.. ఈ కేసులో గరిష్టంగా ఐదు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 10 లక్షల వరకు జరిమానా ఉంటుంద‌ని పోలీసులు తెలిపారు.

Exit mobile version