Site icon HashtagU Telugu

Cauvery Water Sharing Issue : సీఎం సిద్ధరామయ్య, సీఎం స్టాలిన్‌కు అంతిమ సంస్కారం

Cauvery Water Sharing Issue

Cauvery Water Sharing Issue

కర్ణాటక, తమిళనాడు మధ్య మరోసారి కావేరీ నదీ జలాల వివాదం (Cauvery Water Sharing Issue) ఉదృతం అవుతుంది. 15 రోజుల పాటు కావేరీ నది నుంచి తమిళనాడు (Tamilanadu)కు నీరు విడుదల చేయాలని కావేరీ బోర్డు (Cauvery Board) ఆదేశాలు ఇవ్వడంతో కన్నడిగులు భగ్గుమంటున్నారు. తమిళనాడుకు కావేరీ నది నీటిని విడుదల చేయవద్దంటూ.. బెంగళూరు​ వ్యాప్తంగా మంగళవారం బంద్‌ (Bengaluru bandh)కు పిలుపునిచ్చారు. దీంతో బెంగుళూర్ వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. మరోవైపు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తమిళనాడు సీఎం స్టాలిన్‌కు అంతిమ సంస్కారం చేస్తూ కన్నడ రైతులు నిరసన వ్యక్తం చేశారు. తాగుకు, సాగుకు నీళ్లు లేని కరవు పరిస్థితుల్లో తమిళనాడు రాష్ట్రానికి నీటిని విడుదల చేయవద్దంటూ ఆందోళన తీవ్రతరం చేశారు.

ఇదే తరుణంలో హీరో కిచ్చా సుదీప్ (Hero Kiccha Sudeep) ట్వీట్ చేశారు. కన్నడ భూమి, నీరు, భాషకు సంబంధించిన అన్ని పోరాటాల్లో నేను ఎప్పుడూ మీతో ఉంటాను అన్నారు. “ఈ ఏడాది వానలు లేకపోవడంతో వ్యవసాయమే కాకుండా తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందిగా మారిందని.. వర్షాకాలం తప్ప మనకు తాగునీటి వనరులు లేవు. కన్నడిగులు కావేరీ నదిపై ఆధారపడతాం. కరవు అధ్యయనం కమిటీ- కావేరీ కమిటీ సాంకేతిక నిపుణులు కర్ణాటకలో ప్రస్తుత కరవు పరిస్థితుల గురించి ట్రైబ్యునల్ కోర్టును, కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే ఒప్పించాలి. మన నీరు మన హక్కు” అని సుదీప్ పేర్కొన్నారు.

అసలు ఈ వివాదం ఈనాటిది కాదు..తమిళనాడు-కర్ణాటకల (Tamil Nadu – Karnataka) మధ్య సుమారు 130 ఏళ్లుగా కావేరీ నదీ జలాల పంపిణీకి సంబంధించిన వివాదం నడుస్తోంది. అంటే ఇండియా స్వతంత్ర దేశంగా ఏర్పడక ముందే ఈ వివాదం మొదలయ్యింది. మైసూరు, మద్రాసు ప్రావిన్సుల మధ్య.. 1892లో ఈ వివాదం ప్రారంభం అయ్యింది. ఆ సమయంలో మైసూరు ప్రాంతంలో.. రాజుల పరిపాలన సాగుతుండగా.. మద్రాస్‌ ప్రావిన్స్‌లో బ్రిటీష్‌ పాలన ఉంది. కావేరీ నది జన్మస్థలం కొడుగు జిల్లా, తలకావేరీ. దీని పరివాహక ప్రాంతం కర్ణాటక, తమిళనాడుతోపాటు కేరళ, పుదుచ్చేరీల్లోనూ ఉంది. కానీ వివాదం మాత్రం ప్రధానంగా కర్ణాటక, తమిళనాడు మధ్యనే రాజుకుంటుంది. అప్పటి నుండి ఈ వివాదం కొనసాగుతూనే ఉంది.

Read Also : Minister Vemula: కేసిఆర్ తోనే సమగ్రాభివృద్ధి: మంత్రి ప్రశాంత్ రెడ్డి