Union Minister : కేంద్ర మంత్రి సురేష్ గోపిపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. త్రిసూర్ పరిధిలోని పూరం జాతర ఉత్సవాలకు త్వరగా చేరుకోవడానికి అంబులెన్సును కేంద్ర మంత్రి దుర్వినియోగం చేశారనే అభియోగంతో కేసును నమోదు చేసినట్లు తెలిసింది. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్), మోటారు వాహన చట్టంలోని పలు సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది.
Also Read :Google Pay Laddoos : నవంబరు 7 లాస్ట్ డేట్.. ‘గూగుల్ పే’ లడ్డూలతో క్యాష్ బ్యాక్
కేంద్ర మంత్రి సురేష్ గోపి(Union Minister) అంబులెన్స్‌లో త్రిసూర్ పూరంకు ప్రయాణించడం వల్ల ఆ మార్గంలోని ట్రాఫిక్ చాలాచోట్ల స్తంభించిందని అంటున్నారు. దీనివల్ల పూరం ఉత్సవాలకు వెళ్తున్న భక్తులకు అసౌకర్యం కలిగిందని చెబుతున్నారు. సురేష్ గోపి ఉద్దేశపూర్వకంగానే అంబులెన్సులో ప్రయాణించారనే అభియోగాన్ని పోలీసులు నమోదు చేసినట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలను కేంద్ర మంత్రి సురేష్ గోపి ఖండించారు. తనపై వచ్చిన ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)తో దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. తన వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినందు వల్ల.. దానికి బదులుగా అంబులెన్సులో ప్రయాణించానని కేంద్ర మంత్రి సురేష్ గోపి వివరణను విడుదల చేశారు. దుండగుల దాడిలో తన కాళ్లకు గాయాలు అయినట్లు తెలిపారు.
Also Read :Yogi Adityanath : యూపీలో కలకలం.. సీఎం యోగికి ఆ మహిళ బెదిరింపు మెసేజ్
అంతకుముందు సురేష్ గోపి ఇందుకు పూర్తి విరుద్ధమైన ప్రకటనను విడుదల చేశారు. ‘‘నేను అంబులెన్సులో పూరం ఉత్సవాలకు రాలేదు. ఒక ప్రైవేటు కారులో అక్కడికి వెళ్లాను. అది జిల్లా బీజేపీ అధ్యక్షుడి వ్యక్తిగత వాహనం. ఒకవేళ ఎవరైనా తనను అంబులెన్సులో చూశారని చెబితే.. దాన్ని నిరూపించాలి. దీన్ని నిగ్గు తేల్చేందుకు సీఎం పినరయి విజయన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న కేరళ పోలీసులు చాలరు. సీబీఐ దర్యాప్తు తప్పనిసరి’’ అని కేంద్ర మంత్రి సురేష్ గోపి పేర్కొన్నారు. అయితే తన ఈ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకున్నారు. అనివార్య పరిస్థితుల్లో అంబులెెన్సును వాడాల్సి వచ్చిందన్నారు.