Karnataka Politics: క్యాంప్ పాలిటిక్స్ షురూ.. కాంగ్రెస్ అభ్యర్థులు హైఅలర్ట్!

కర్ణాటకలో క్యాంప్ పాలిటిక్స్ మొదలయ్యాయి. కాంగ్రెస్ తమ అభ్యర్థులను అలర్ట్ చేసింది.

  • Written By:
  • Updated On - May 12, 2023 / 02:06 PM IST

ప్రస్తుతం దేశంలో ఎక్కడా చూసినా కర్ణాటక (Karnataka) రాజకీయాల గురించి చర్చ కొనసాగుతోంది. మళ్లీ బీజేపీ గెలుస్తుందా? అధికార పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందా? లేదా జేడీఎస్ కింగ్ మేకర్ నిలుస్తుందా? అనే ప్రశ్నలు ఉత్కంఠత రేపుతున్నాయి. అంతేకాదు.. ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలు సెమి ఫైనల్ గా భావిస్తుండటంతో మరింత ఉత్కంఠత రేపుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసే ఎన్నికలు కావడంతో కర్ణాటక చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేయడం, బీజేపీ నేత ఒకరు మెజార్టీ రాకున్నా అధికారంలోకి వస్తాం అనే తేల్చి చెప్పిన నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది.

కర్ణాటకలోని కాంగ్రెస్ తమ అభ్యర్థులను (Candidates) బెంగళూరుకు రావాలని కోరింది. కర్నాటకలో బీజేపీ ఆపరేషన్ కు ఎలాంటి అవకాశాలు తీసుకోకుండా, ప్రభుత్వం ఏర్పడేంత వరకు తమ అభ్యర్థులను బెంగళూరు చేరుకుని నిర్దిష్ట ప్రదేశంలో ఉండాలని కాంగ్రెస్ ఆదేశించింది. కౌంటింగ్ రోజు (మే 13) ముందు అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఎగ్జిట్ పోల్స్ హంగ్ అసెంబ్లీని అంచనా వేసినప్పటికీ బీజేపీ, కాంగ్రెస్ రెండూ తమకు మెజారిటీ వస్తాయని చెబుతున్నాయి. అధికారాన్ని కైవసం చేసుకునేందుకు రెండు పార్టీలు ఎమ్మెల్యేలను కొనుక్కోవచ్చు, అమ్మవచ్చు. గతంలో బీజేపీ ఆపరేషన్ ఆకర్స్ కు తెరలేపి అధికారం కైవసం చేసుకుంది. దీంతో బీజేపీ వ్యూహానికి ధీటుగా కాంగ్రెస్ తన వంతు పాత్ర పోషించేందుకు సిద్ధమవుతోంది. కాంగ్రెస్ (Congress) నేతలు పక్కా చూపులు చూడకుండా, తమ పార్టీ అభ్యర్థుల భద్రత కోసం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది.

ఈ నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డి.కె. శివకుమార్ (DK Shiva Kumar), రాష్ట్ర ఇన్‌ఛార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా,  ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్య గురువారం రాత్రి అభ్యర్థులందరితో వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. బీజేపీతో టచ్ లోకి వెళ్లకుండా ఎలా ఉండాలనే  దానిపై వారితో వివరంగా మాట్లాడారు. ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కాంగ్రెస్‌కే దక్కుతుందని, అత్యాశకు లొంగవద్దని నేతలు అభ్యర్థులకు సూచించారు. ఎమ్మెల్యే అభ్యర్థులు తమ గెలుపు ఖాయమని భావించిన వెంటనే బెంగళూరు చేరుకోవాలని కోరారు. ప్రభుత్వం ఏర్పడే వరకు అభ్యర్థులు కూడా నిర్దిష్ట ప్రదేశంలో ఉండాలని కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Also Read: Custody Review: కస్టడీ మూవీ రివ్యూ.. అక్కినేని హీరో హిట్ కొట్టాడా!