Woman Body Structure : అమ్మాయిల శరీరాకృతి గురించి కామెంట్లు చేయడం కూడా లైంగిక వేధింపే అని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. కేరళ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు మాజీ ఉద్యోగి ఒకరు, తన తోటి మహిళా ఉద్యోగిపై అసభ్య వ్యాఖ్యలు చేయడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. ‘‘ఆమెకు అందమైన శరీరం ఉందన్న కోణంలోనే నేను శరీరాకృతి గురించి మాట్లాడాను. లైంగిక వేధింపులకు పాల్పడాలనే దురుద్దేశం నాకు లేదు. దీన్ని లైంగిక వేధింపుగా చూడొద్దు’’ అని హైకోర్టుకు సదరు వ్యక్తి తెలిపాడు.
Also Read :One Nation One Election: ‘జమిలి ఎన్నికల’పై జేపీసీ తొలి సమావేశం
అతడి వాదనపై న్యాయమూర్తి జస్టిస్ ఎ. బద్రుద్దీన్ సారథ్యంలోని హైకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ వ్యక్తిపై నమోదైన లైంగిక వేధింపుల కేసును కొట్టివేసేందుకు కోర్టు(Woman Body Structure) నిరాకరించింది. మహిళల శరీరాకృతిపై కామెంట్లు చేయడం కూడా లైంగిక వేధింపుల కిందకే వస్తుందని స్పష్టం చేసింది. తోటి మహిళా ఉద్యోగి గౌరవానికి భంగం కలిగించినందుకుగానూ.. సదరు వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు బెంచ్ కొట్టివేసింది. మహిళల శరీరాకృతిపై వ్యాఖ్యలు చేస్తే ఐపీసీ సెక్షన్ 354A(1)(iv) కింద నేరంగా పరిగణిస్తామని కోర్టు వెల్లడించింది. 2017లో నమోదైన ఈ కేసుకు సంబంధించి ఎట్టకేలకు ఏడేళ్ల తర్వాత ఇప్పుడు హైకోర్టులో తీర్పు రావడం గమనార్హం.
Also Read :Prime Minister Modi : ప్రధాని మోడీ పర్యటనకు భారీ భద్రత.. ఎస్‌పీజీ ఆధీనంలో ఆంధ్రా వర్సిటీ
మహిళా ఉద్యోగి ఫిర్యాదు ప్రకారం.. ఆమెపై సదరు వ్యక్తి 2013 సంవత్సరం నుంచి అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడు. కొంతకాలం పాటు అభ్యంతరకర మెసేజ్‌లు పంపేవాడు. వాయిస్‌కాల్స్ చేసేవాడు. శరీరాకృతి గురించి పదేపదే వర్ణనలు చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసేవాడు. దీంతో సదరు మహిళా ఉద్యోగి ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిపై లైంగిక వేధింపుల కేసును నమోదు చేశారు.ఈ కేసును కొట్టివేయాలంటూ ఆ వ్యక్తి కేరళ హైకోర్టులో పిటిషన్ వేయడానికి తిరస్కరణ ఎదురైంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 354A(1)(iv), 509, కేరళ పోలీసు చట్టం (KP చట్టం) సెక్షన్ 120(o) కింద లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.