BRS : హిందూ సెంటిమెంట్ , ఎన్నిక‌ల‌కు కేసీఆర్ ఎత్తుగ‌డ‌

తెలంగాణ సీఎం కేసీఆర్ (BRS) ఏది చేసినా దాని వెనుక రాజ‌కీయ ఎత్తుగ‌డ ఉంటుంది. ఆత్మీయ సందేశం తాజాగా తెలంగాణ స‌మాజానికి (Election)పంపారు.

  • Written By:
  • Publish Date - March 21, 2023 / 12:08 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ (BRS) ఏది చేసినా దాని వెనుక రాజ‌కీయ ఎత్తుగ‌డ ఉంటుంది. ఆత్మీయ సందేశం తాజాగా తెలంగాణ స‌మాజానికి (Election)పంపారు. దాని వెనుక ఉన్న ర‌హ‌స్యాన్ని రాజ‌కీయ పండితులు అన్వేషిస్తున్నారు. గ‌త రెండు సాధార‌ణ ఎన్నిక‌ల‌ను తీసుకుంటే కేసీఆర్ విభిన్నంగా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లారు. తొలిసారి జరిగిన 2014 ఎన్నిక‌ల్లో పూర్తిగా తెలంగాణ అస్థిత్వాన్ని పెద్ద‌గా చూపారు. నీళ్లు, నిధులు, నియామ‌కాల‌ను ఓట‌ర్ల ముందు పెట్టారు. అయిన‌ప్ప‌టికీ ఆ ఎన్నిక‌ల్లో కేవ‌లం 63 స్థానాల‌తో మైనార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్ప‌రించారు. ఆ త‌రువాత విప‌క్షాల‌ను నిర్వీర్యం చేయ‌డానికి అన్ని ర‌కాలుగా ప్ర‌య‌త్నం చేసి స‌ఫ‌లం అయ్యారు. ప్ర‌ధాన పార్టీల్లోని ఎమ్మెల్యేల‌ను లాగేసుకుని బ‌ల‌మైన ప్ర‌భుత్వంగా తీర్చిదిద్దుకున్నారు.

కేసీఆర్   రాజ‌కీయ ఎత్తుగ‌డ (BRS)

ఇక 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల(Election) సంద‌ర్భంగా జాతీయ వాదాన్ని జ‌స్ట్ ప్ర‌స్తావించారు. ఆ త‌రువాత దాన్ని వెంట‌నే మూల‌న‌ప‌డేసి సెంటిమెంట్ ను రంగ‌రించారు. మంచినీళ్లు, విద్యుత్ స‌ర‌ఫ‌రాల‌ను ప్ర‌స్తావిస్తూ ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకున్నారు. అంతేకాదు, చంద్ర‌బాబు రూపంలో ఆంధ్రోళ్లు మ‌ళ్లీ వ‌స్తార‌ని ఓట‌ర్ల‌ను బ‌య‌ట‌పెట్టారు. సెంటిమెంట్ ను(BRS) తారాస్థాయికి తీసుకెళ్లారు. రైతు బంధు ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించ‌డం ద్వారా రైతుల‌ను ఆక‌ట్టుకున్నారు. సీన్ క‌ట్ చేస్తే, ఆ ఎన్నిక‌ల్లో బ‌ల‌మైన ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌గ‌లిగారు. ఆ రోజు నుంచి కాళేశ్వ‌రం, రైతు బంధు ప‌థ‌కాల మీద ప్ర‌భుత్వం ఆధార‌ప‌డింది. అంతే స్థాయిలో అవినీతి, అక్ర‌మాలు, లా అండ్ ఆర్డ‌ర్ అంశాలు కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టాయి. ప్ర‌స్తుతం కేసీఆర్ ప్ర‌భుత్వం ఇరుకున‌ప‌డింది.

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్   క‌ల్వ‌కుంట్ల కుటుంబాన్ని

వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కేసీఆర్(BRS) సిద్ద‌మ‌వుతున్నారు. పైగా గత ఎన్నిక‌ల సంద‌ర్భంగా కేంద్రం మ‌ద్ధ‌తు ఉంది. ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, సీఎం కేసీఆర్ మ‌ధ్య `ఇగో` స‌మ‌స్య ఏర్ప‌డింది. ఆ క్ర‌మంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య యుద్ధంగా మారింది. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ ప్ర‌స్తుతం క‌ల్వ‌కుంట్ల కుటుంబాన్ని వెంటాడుతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో మూడోసారి రాష్ట్రంలో అధికారంలోకి రావ‌డానికి ఆయ‌న చేస్తోన్న ప్ర‌య‌త్నాలు అనేకం. అంతేకాదు, టీఆర్ఎస్ పార్టీని ఇటీవ‌ల బీఆర్ఎస్ గా మార్చేశారు. జాతీయ రాజ‌కీయాల(Election) మీద కేసీఆర్ దృష్టి పెట్టారు. ఈసారి రాష్ట్ర ఎన్నిక‌లు కేటీఆర్ ఫేమ్ తో జ‌ర‌గ‌నున్నాయ‌ని తెలుస్తోంది.

Also Read : BRS : తెలంగాణ ఏర్పాటు న‌గ్న‌స‌త్యాలు!BRS చీఫ్ నోట ఇలా.!!

మూడోసారి సీఎం కావ‌డానికి ఈ సారి భిన్నంగా కేసీఆర్(BRS) వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. యాదాద్రిని ప్రారంభించిన ఆయ‌న ల‌క్ష్మీనర‌సింహ‌స్వామి ఆశీస్సులు కావాల‌ని కోరుకుంటున్నారు. అంతేకాదు, బ‌స్సు ప్ర‌మాదంలో భ‌క్తులు చ‌నిపోయిన‌ప్పుడు ఏ మాత్రం ప‌ట్టించుకోని సీఎం కేసీఆర్ ఇటీవ‌ల కొండ‌గ‌ట్టు వెళ్లారు. దేవాల‌యం అభివృద్ధి కోసం 1000 కోట్ల‌ను ప్ర‌క‌టించారు. తాజాగా ఆత్మీయ స‌మ్మేళ‌నాల‌ను (Election)నిర్వ‌హిస్తూ పూర్వకాలంలోని దేవాల‌యాల‌ను, చారిత్ర‌క అంశాల‌ను బ‌య‌ట‌కు తీయ‌డం ద్వారా ప్ర‌జ‌ల్లోని ఆధ్యాత్మిక సెంటిమెంట్ ను ఓట్ల రూపంలో మ‌లుచుకోవ‌డానికి ప్ర‌య‌త్నాల‌ను మొద‌లు పెట్టారు. అందుకే, ఆధ్యాత్మిక‌ స‌మ్మేళ‌నాల స్థానంలో ఆత్మీయ స‌మ్మేళ‌నాల‌ను పెడుతున్నారు. తాజాగా వ‌న‌ప‌ర్తి రాజులు నిర్మించిన గోపాల స‌ముద్రాన్ని నిర్మించ‌డానికి ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంది.

బీజేపీని దెబ్బ కొట్ట‌డానికి ఆధ్యాత్మిక  మార్గాన్ని (Election)

జాతీయ స్థాయిలో కేసీఆర్ పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కానీ, ఆయ‌న చేసిన ఫ‌లితాలు ఎక్క‌డా లాభించిన‌ట్టు కనిపించ‌డంలేదు. ప్ర‌త్యేక వాదాన్ని మూల‌న‌ప‌డేసి(BRS) ప్ర‌స్తుతం స‌మైక్య వాదాన్ని ఆయ‌న అందుకున్నారు. ఆ క్ర‌మంలో ప్ర‌స్తుతం సెటిల‌ర్లు ఆయ‌నకు సానుకూలంగా ఉన్నారు. ఆ ఓట్ల‌తో గెలుపును అందుకోవాల‌ని చూస్తున్నారు. హిందూవాదంతో ఉన్న బీజేపీని దెబ్బ కొట్ట‌డానికి ఆధ్యాత్మిక(Election) మార్గాన్ని కేసీఆర్ ఎంచుకున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా దేవాల‌యాల‌ను నిర్మిస్తామ‌ని హామీలు ఇస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ ప్ర‌చారాల‌ను గ‌మ‌నించిన కేసీఆర్‌ ఆత్మీయ స‌మ్మేళ‌నాల రూపంలో ఆధ్యాత్మిక పంథా దిశ‌గా ఓట‌ర్ల‌ను మ‌ల‌చుకుని దైవ సెంటిమెంట్ తో మూడోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది.

Also Read : BRS Kavitha :ఆర్థిక పాపం పండింది!ED బేడీల వేళ నారీభేరీ!