Site icon HashtagU Telugu

Anna University Rape Case : కొరడా దెబ్బలతో అన్నామలై నిరసన

Annamalai Protest

Annamalai Protest

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై (BJP’s Annamalai)ఇటీవల అన్నా యూనివర్శిటీ(Anna University Rape Case)లో ఒక విద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసులో న్యాయం కోరుతూ వినూత్న నిరసన చేపట్టారు. ఆయన స్వయంగా తన ఇంటి బయట ఆరు కొరడా దెబ్బలు కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో అన్నామలై, డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు తాను చెప్పులు వేసుకోనని, చెప్పులు లేకుండా నడుస్తానని సవాల్ చేశారు.

ఈ నిరసన ద్వారా అన్నామలై తన ఆగ్రహాన్ని రాష్ట్రంలో ఉన్న డీఎంకే ప్రభుత్వంపై వ్యతిరేకతను వ్యక్తం చేశారు. యూనివర్శిటీలో జరిగిన లైంగిక వేధింపుల కేసు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో నిందితుడు ఇంకా బయట ఉన్నప్పటికీ, న్యాయపరమైన చర్యలు ఆలస్యం అవుతుంది. ఈ కేసులో డీఎంకే నాయకులకు సంబంధం ఉందని అన్నామలై ఆరోపించారు. నిందితుడు డీఎంకే పార్టీకి చెందిన ప్రజా నాయకుడిగా ఉన్నాడని అన్నామలై పేర్కొన్నారు. అయితే, డీఎంకే నేతలు ఈ ఆరోపణలను ఖండించారు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కమిషన్ డీజీపీకి, నిందితుడి పై నమోదైన అన్ని ఎఫ్‌ఐఆర్‌ల కాపీలు, ఆ కేసుల్లో తీసుకున్న చర్యల వివరాలను పంపాలని కోరింది.

Read Also : Manmohan Singh : భారత రాజకీయాల్లో ఒక శకం ముగిసింది: కమల్ హాసన్