BJP MLA’s Son: బీజేపీ ఎమ్మెల్యే కుమారుడి ఇంట్లో సోదాలు, రూ.7.62 కోట్లు స్వాధీనం!

బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు (BJP MLA's Son) రూ.40 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడినట్టు తెలుస్తోంది.

  • Written By:
  • Updated On - March 3, 2023 / 12:33 PM IST

మార్కెట్ దిగ్గజం అదానీ (Adani) వ్యవహరంతో బీజేపీ నాయకత్వం సతమతమవుతుంటే.. తాజాగా కర్ణాటక బీజేపీలో ఆ పార్టీ మరో ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు (BJP MLA’s Son) రూ.40 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అయితే దాడులు కొనసాగించిన లోకాయుక్త అధికారులు అతని, సహచరుల ఇళ్లలో రూ.7.62 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం వర్గాలు స్పష్టం చేశాయి.

ఎమ్మెల్యే నివాసంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి పారుదల బోర్డు (బీడబ్ల్యూఎస్‌ఎస్‌బీ) చీఫ్‌ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే మాదాల్‌ విరూపాక్షప్ప కుమారుడు (BJP MLA’s Son) ప్రశాంత్‌ నివాసం, కార్యాలయంలో లోకాయుక్త భారీగా డబ్బును స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ సహా ఐదుగురిని అధికారులు అరెస్ట్ చేశారు. 40 లక్షల నగదు ఇవ్వడానికి వచ్చిన ప్రశాంత్ బావ సిద్ధేష్, అకౌంటెంట్లు సురేంద్ర, నికోలస్, గంగాధర్ అనే మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు లోకాయుక్త వర్గాలు తెలిపాయి. నిందితులను లోకాయుక్త ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు.

బెంగళూరులోని సంజయ్‌నగర్ ప్రాంతంలోని కేఎంవీ, హవేలీలోని చన్నగిరి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప (BJP MLA’s Son) నివాసం, కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. దాడుల్లో కీలక పత్రాలు, ఇతర ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో అధికార బీజేపీ (BJP)కి గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ప్రభుత్వ (Govt) టెండర్లలో 40 శాతం కమీషన్, లంచం పేరుతో విపక్షాలు దాడులు చేస్తున్న తరుణంలో ఈ ఘటన తెరపైకి వచ్చింది.

Also Read: Thalaivar 170: జై భీమ్ దర్శకుడితో రజినీకాంత్ 170వ చిత్రం!