Badrinath: బద్రీనాథ్‌ హైవే మూపివేత..చిక్కుకుపోయిన 2 వేల మంది యాత్రికులు

  • Written By:
  • Updated On - July 11, 2024 / 03:38 PM IST

Pilgrims Are Stuck :  గత కొన్ని రోజులుగా ఉత్తరాది రాష్ట్రాలలో భారీ వర్షాలు(Heavy rains) కురుస్తున్నాయి. దీంతొ ఎక్కడికక్కడ కొండచరియలు(Landslides) విరిగిపడుతున్నాయి. కొండ రాష్ట్రాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌ను వర్షాలు ముంచెత్తుతున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.

భారీ వర్షాలు కారణాంగా చమోలీ జిల్లా(Chamoli District)లో బుధవారం బద్రీనాథ్‌ యాత్రాస్థలి(Badrinath pilgrimage site)ని కలిపే జాతీయ రహదారి పై భారీగా కొండ చరియలు(Landslides) విరిగిపడ్డాయి. దీంతో ఆ రహదారిని కూడా అధికారులు మూసివేశారు. ఈ క్రమంలోనే 48 గంటల పాటు ఈ రోడ్డును మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

Read Also: Swimmer Rescued : బీచులో మునిగింది.. 80 కి.మీ దూరంలో ప్రాణాలతో తేలింది

హైవే మూసివేతతో బద్రీనాథ్, జోషిమఠ్‌, నీతి, మన, తపోవన్, మలారి, లత, రాయిని, పాండుకేశ్వర్, హేమకుండ్ సాహిబ్‌లతో కనెక్టివిటీ తెగిపోయింది. సుమారు 2,000 మంది యాత్రికులు (Pilgrims)హైవేపై చిక్కుకుపోయారు. రహదారిని క్లియర్‌ చేసేందుకు బోర్డర్‌ రోడ్‌ ఆర్గనైజేషన్‌ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సుమారు 241 ఎక్స్‌కవేటర్లను అక్కడ మోహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరికల దృష్ట్యా ఛార్‌దామ్‌ యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Read Also: Mr. Bachchan : ట్రోలర్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన హరీష్ శంకర్

 

 

 

 

Follow us