Statue of Shankaracharya : ఆదిశంకరాచార్యుడిని చెక్కిన యువకుడు – అరుణ్ యోగిరాజ్

యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసిన ఆ యువకుడు... ఓ ప్రవేట్ కంపెనీలో హెచ్ ఆర్ మేనేజర్గా ఉద్యోగం సాధించాడు.

  • Written By:
  • Updated On - November 8, 2021 / 11:18 AM IST

మైసూరు: యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసిన ఆ యువకుడు… ఓ ప్రవేట్ కంపెనీలో హెచ్ ఆర్ మేనేజర్గా ఉద్యోగం సాధించాడు. ఐదెంకల జీతం…వారానికి రెండు రోజులు సెలవులు..అయినప్పటికీ ఆ యువకుడి ఇష్టమైన రంగం ముందు ఇవేమీ నిలవలేదు. చివరికి తన కుటుంబం సాంప్రదాయాన్ని గౌరవించాలని ఆ ఉద్యోగాన్ని వదలిలేశాడు.

Also read: కేథార్ నాథ్ లో ఆదిశంకరాచార్య విగ్రహం.. విశేషాలు!

రెండు రోజుల క్రితం కేదార్నాథ్లో జగద్గురువు శ్రీ ఆది శంకరాచార్యుల విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని చెక్కిన యువకుడు అరుణ్ యోగిరాజ్.తన తండ్రి బి.ఎస్. యోగిరాజ్ శిల్పి.ఇటీవల కాలంలో ఆయన మరణించారు. కర్ణాటకలో శిల్ప అకాడమీ స్థాపించి అమరశిల్పి జకనాచారి అవార్డు, కర్ణాటక రాజ్యోత్సవ అవార్డుతో్ సహా అనేక అవార్డులను అందుకున్నారు.ఆయన వారసత్వాన్ని కొనసాగించాలని భావించిన అరుణ్ యోగిరాజ్…తన ఉద్యోగన్ని వదిలివేసి మైసూర్ తిరిగి వచ్చాడు. వచ్చిన తరువాత కేదారానాథ్లో ఆది శంకరాచార్యుల విగ్రహాన్ని చెక్కాడు. ఈ ప్రాజెక్టుపై తొమ్మిది నెలలు శ్రమించి జూన్లో పూర్తి చేశానని..

తాను విగ్రహ ప్రతిష్టాపన కోసం కేదార్నాథ్లో ఒక నెల గడిపానని తెలిపారు.కాని ఆవిష్కరణకు ఒక వారం ముందు తాను ఇంటికి తిరిగి రావాల్సి వచ్చిందని… ప్రధానమంత్రి ఆవిష్కరించే కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా అందరూ తనను కోరినప్పటికీ, తాను చాలాకాలంగా లేకపోవడంతో తన తల్లిని చూసుకోవాలని… అందుకే ఇంటికి తిరిగి వచ్చానని అరుణ్ యోగిరాజ్ తెలిపారు.

 https://twitter.com/SangitaSJindal/status/1456460342880444416

తొమ్మిది నెలల పాటు ప్రతిరోజూ దాదాపు 14 గంటల పాటు పనిచేసినప్పటికీ ఎటువంటి ఇబ్బందులు కలగలేదని…విగ్రహం చాలా వరకు రోడ్డు మార్గంలో తీసుకువచ్చామని తెలిపారు. చమోలీ ఎయిర్బేస్ నుండి IAF యొక్క చినూక్ హెలికాప్టర్ ద్వారా కేదార్నాథ్కు విమానంలో తరలించబడింది అరుణ్ తెలిపారు . ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, విగ్రహం మొత్తం 28 టన్నుల బరువు కలిగి ఉంది. అరుణ్ యోగిరాజ్ కృషికి గుర్తింపుగా జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్.టి. సోమశేఖర్ తదితరులు శుక్రవారం ఆయన నివాసంలో ఘనంగా సన్మానించారు.అయితే అరుణ్ యోగిరాజ్ మాత్రం విశ్రాంతి తీసుకోవడం లేదు. అతని చేతిలో మరో ప్రాజెక్ట్ ఉంది – 25 అడుగుల ఎత్తైన ఆంజనేయ ఏకశిలా విగ్రహం చెక్కేందుకు సిద్దమవుతున్నారు.

Also Read: మోడీ అబద్ధాలను సాక్ష్యాలతో బయటపెట్టిన అమెరికా