Siddaramaiah Losing Top Post : కర్ణాటక రాజకీయం రసవత్తరంగా మారింది. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూములకు సంబంధించిన కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్య విచారణను ఎదుర్కోవాల్సి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో సమీకరణాలు మారే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా సీఎం సిద్ధరామయ్య ఆర్థిక సలహాదారుడు, సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవరాజ్ రాయరెడ్డి చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే అవే సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. ఒకవేళ సిద్ధరామయ్య సీఎం సీటు నుంచి తప్పుకునే పరిస్థితే వస్తే.. ఆయన చెప్పినవాళ్లే తదుపరి కర్ణాటక సీఎం అవుతారని ఆయన పేర్కొన్నారు. ఈ పోటీలో కాంగ్రెస్ సీనియర్ నేతగా, చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిగా తన పేరు కూడా తప్పకుండా ఉంటుందన్నారు. వక్కలిగ, లింగాయత్ వర్గాలకు చెందిన తనలాంటి ప్రముఖ నేతలు చాలామందే కాంగ్రెస్‌లో ఉన్నారని.. వారిలో ఎవరి పేరునైనా సిద్ధరామయ్య కాంగ్రెస్ హైకమాండ్‌కు సిఫారసు చేసే అవకాశం ఉంటుందని బసవరాజ్ రాయరెడ్డి(Siddaramaiah Losing Top Post) చెప్పారు. ‘‘రాష్ట్రానికి ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు.. నేను ఎందుకు ముఖ్యమంత్రిని కాకూడదని మీడియాను అడుగుతున్నాను’’ అని ఆయన ప్రశ్నించారు.
Also Read :ISRO Vs Egyptian God of Chaos : మన భూమికి ‘అపోఫిస్’ గండం.. రక్షకుడిగా మారిన ఇస్రో
‘‘నేను కూడా లింగాయత్ వర్గానికి చెందిన వాడినే. లింగాయత్ ఎమ్మెల్యేల్లో నేను, బీఆర్ పాటిల్ సీనియర్ ఎమ్మెల్యేలం. ఆయనకు 83 ఏళ్లు. నాకు 68 ఏళ్లే అయినా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. నేను ముఖ్యమంత్రిని కాకూడదని ఏమీ లేదు. హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంలో నేను అత్యధిక సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. మా పార్టీ అభ్యర్థులను కమ్యూనిటీ ఆధారంగా ఎంపిక చేయాలనుకుంటే నేనే అభ్యర్థిగా ఉండాలని చాలాసార్లు చెప్పాను’’ అని బసవరాజ్ రాయరెడ్డి కామెంట్స్ చేయడం గమనార్హం.
Also Read :Blood Cancer Awareness: బ్లడ్ క్యాన్సర్ లక్షణాలివే..? ఈ పరీక్షలు చాలా ముఖ్యం..!
ప్రస్తుతం కర్ణాటక డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ సీఎం సీటును ఆశిస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే టైంలోనే ఆయన సీఎం సీటు కావాలని పట్టుబట్టారు. అయితే మోస్ట్ సీనియర్ అయినందున సిద్దరామయ్యకు కాంగ్రెస్ పార్టీ ఆ అవకాశాన్ని కట్టబెట్టింది. భవిష్యత్తులో తప్పకుండా సీఎం స్థానానికి పేరును పరిశీలిస్తామని డీకే శివకుమార్‌కు సోనియాగాంధీ హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు సీఎం సిద్ధరామయ్య వర్గంలోని నేతలు తాము కూడా సీఎం రేసులో ఉన్నామనే వాణిని వినిపిస్తుండటంతో కాంగ్రెస్‌లో చాపకింద నీరులా మొదలైన వర్గపోరును అద్దంపడుతోంది.