Site icon HashtagU Telugu

Flight Without Governor : గవర్నర్‌ను వదిలేసి హైదరాబాద్ వెళ్లిపోయిన విమానం.. ఎందుకు ?

Flight Without Governor

Flight Without Governor

Flight Without Governor : బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగింది. ఎయిర్ పోర్ట్ లోని టెర్మినల్ 2 నుంచి కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్‌ను ఎక్కించుకోకుండానే ఎయిరేసియా విమానం హైదరాబాద్‌కు బయలుదేరింది. ఈ ఘటన జులై 27న  మధ్యాహ్నం చోటు చేసుకుంది. అయితే టెర్మినల్‌కు చేరుకోవడంలో గవర్నర్ ఆలస్యం చేశారని ఎయిర్‌లైన్స్ చెబుతోంది. కానీ గవర్నర్ విమానాశ్రయ లాంజ్‌లో వేచి ఉన్నా.. ఎక్కించుకోకుండా విమానయాన సంస్థ ప్రోటోకాల్ ను ఉల్లంఘించిందని అధికారులు అంటున్నారు.

Also read : YCP Party: కోడిగుడ్లకు వైసీపీ రంగులు.. ఇదేమీ ప్రచారం అంటున్న జనం

“జులై 27న  గవర్నర్  లగేజీని కూడా ఎయిరేసియాలో ఎక్కించారు. వీఐపీ లాంజ్ నుంచి టెర్మినల్ 2కు గవర్నర్ చేరుకునేలోపు విమానం టేకాఫ్ అయింది” అని అధికారిక వర్గాలు తెలిపాయి. బోర్డింగ్ గేట్ కు గవర్నర్ చేరుకోవడంలో ఆలస్యం కావడం వల్ల విమానం వెళ్లిపోయిందన్నారు. దీంతో 90 నిమిషాల అనంతరం మరో విమానంలో గవర్నర్ హైదరాబాద్ కు బయలుదేరారు. కాగా, ఎయిరేసియా సిబ్బంది నిర్వాకంపై గవర్నర్ ప్రోటోకాల్ అధికారులు విమానాశ్రయంలో ఫిర్యాదు చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారు ఒకరు మీడియాకు వెల్లడించారు. గవర్నర్ కు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, ఇందుకు క్షమాపణలు చెబుతున్నామని ఎయిరేసియా ప్రకటించింది.

Also read : Love Story: లేటు వయసులో ఘాటు ప్రేమ.. కూతురు లాంటి అమ్మాయితో ప్రేమలో పడిన వృద్ధుడు?