Site icon HashtagU Telugu

Vijay’s Speech : విజయ్ ఫస్ట్ పొలిటికల్ స్పీచ్ తోనే అదరగొట్టేసాడు

Vijay Speech

Vijay Speech

తమిళ వెట్రి కజగం పార్టీ (TVK) పార్టీ అధినేత, సినీ నటుడు దళపతి విజయ్(Thalapathy Vijay) ఫస్ట్ పొలిటికల్ మీటింగ్ లోనే తనదైన స్పీచ్ తో అదరగొట్టేసాడు. తమిళనాడు విల్లుపురం (Villupuram) జిల్లాలోని విక్రవాండిలో తమిళగ వెట్రి కళగం (Tamizhaga Vetri Kazhagam) మహానాడు సభను ఆదివారం ఏర్పాటు చేశారు. డాక్డర్ బీఆర్ అంబేడ్కర్ పెరియార్‌తో పాటు తమిళ రాజకీయ నేతల కటౌట్స్ మధ్య సభా ప్రాంగణాన్ని అలంకరించగా.. భారీ ఎత్తున అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. దాదాపు 10 లక్షల మంది సభకు హాజరైనట్లు తెలుస్తోంది.

ఇక తన స్పీచ్ విషయానికి వస్తే.. “నాకు రాజకీయ అనుభవం లేకపోవచ్చు, కానీ నేను పాలిటిక్స్ విషయంలో భయపడడం లేదు” అని పేర్కొన్నారు. సినిమా రంగంతో పోల్చితే రాజకీయాలు చాలా సీరియస్‌ అని , ద్రవిడ జాతీయవాదం మరియు తమిళ జాతీయవాదాన్ని వేరుచేయబోను, ఇవి తమిళనాడు గడ్డకు రెండు కళ్లులాంటివి అని పేర్కొన్నారు. లౌకిక మరియు సామాజిక న్యాయ సిద్ధాంతాలే మా భావజాలం అని తెలిపాడు. ప్రతిదీ, ప్రతి ఒక్కరికీ అనే నినాదంతో పార్టీ పనిచేస్తుంది. వన్ కమ్యూనిటీ, వన్ గాడ్ అనే సిద్ధాంతంతో ముందుకు వెళ్తాం అని విజయ్ అన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని పూర్తిస్థాయి మెజార్టీతో గెలిపిస్తారని విశ్వసిస్తున్నాం అని ధీమా వ్యక్తం చేసారు.

బిజెపి నిరంకుశత్వంతో వ్యవహరిస్తోంది అంటూనే డీఎంకే ద్రవిడియన్ నమూనాపైనా విరుచుకుపడ్డారు. తన రాజకీయ ప్రయాణంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. అరియాలూరులో నీట్ విద్యార్థిని అనిత ఆత్మహత్య ఉదంతాన్ని గుర్తు చేస్తూ, ఆ పరీక్షపై తన వ్యతిరేక వైఖరిని ప్రకటించారు. సినిమా ఆర్టిస్ట్‌గా పలు విమర్శలకు సమాధానం ఇస్తున్నాను అని , తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన ఎంజీఆర్‌, ఎన్టీఆర్ పేర్లను ప్రస్తావించారు.

Read Also : SpaceX Crew 8 : 233 రోజుల తర్వాత భూమికి చేరిన వ్యోమగాములు.. ఎలా అంటే ?